Sir Day 3 Collections ధనుష్ మూవీ రికార్డు.. మూడు రోజుల్లోనే లాభాల్లోకి.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

సౌత్ ఇండియన్ స్టార్ హీరో ధనుష్, యువ హీరోయిన్ సంయుక్త మీనన్ జంటగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్ (తమిళంలో వాతి) చిత్రం భారీగా స్పందనను కూడగట్టుకొంటున్నది. ఫిబ్రవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ధనుష్ కెరీర్‌లో బెస్ట్ కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా బిజినెస్, అలాగే 3వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

సార్ ప్రీ రిలీజ్ బిజినెస్

సార్ ప్రీ రిలీజ్ బిజినెస్

సార్ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు, తమిళ భాషల్లో భారీగానే వాల్యూ కట్టారు. ఈ సినిమాను కొన్ని చోట్ల సొంతంగా రిలీజ్ చేసుకోవడం, మరికొన్ని చోట్ల డిస్టిబ్యూటర్లకు షేర్ పద్దతిన రిలీజ్ చేయడం జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి అయితే ఈ సినిమా బిజినెస్‌ను ఓవరాల్‌గా 35 కోట్లుగా అంచనా వేశారు. దాంతో బ్రేక్ ఈవెన్‌ను 36 కోట్లుగా నిర్ణయించారు. దాంతో ఈ సినిమా 36 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

తొలి మూడు రోజుల్లో సార్ మూవీ వసూళ్లు

తొలి మూడు రోజుల్లో సార్ మూవీ వసూళ్లు

సార్ (వాతి) తెలుగు వెర్షన్ మూవీ మూడు రోజులు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 4.05 కోట్లు, రెండో రోజు 5.35 కోట్లు, మూడో రోజు 5.74 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం తెలుగు వెర్షన్ మూడు రోజుల్లో 15 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది.

తమిళంలో వాతి మూవీ కలెక్షన్లు

తమిళంలో వాతి మూవీ కలెక్షన్లు

ఇక తమిళంలో వాతిగా రిలీజైన సార్ చిత్రం భారీగానే కలెక్షన్లు నమోదు చేస్తున్నది. లాంగ్ వీకెండ్ రావడంతో పరిస్థితులను పాజిటివ్‌గా మలచుకొన్నది. దాంతో ఈ చిత్రం గత మూడు రోజుల్లో మంచి వసూళ్లను నమోదు చేసింది. తమిళంలో తొలి రోజు 5.65 కోట్లు, రెండో రోజు 6.25 కోట్లు, మూడో రోజు 6.64 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం గత మూడో రోజుల్లో 18.5 కోట్లకుపైగానే వసూళ్లను రాబట్టింది.

ఓవర్సీస్, అమెరికాలో

ఓవర్సీస్, అమెరికాలో

సార్, వాతి సినిమాకు ఓవర్సీస్‌లో భారీ క్రేజ్ కనిపిస్తున్నది. ధనుష్ నటించిన ఈ సినిమాకు అమెరికాలో మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. అమెరికాలో సార్ చిత్రం 73 లోకేషన్లలో మూడో రోజు 32K కలెక్షన్లతో మొత్తం 128000 డాలర్లు అంటే కోటి రూపాయలు వసూలు చేసింది. ఇక వాతీ సినిమా అమెరికాలో 121 లొకేషన్లో మూడో రోజు 25K డాలర్లు సాధించడం ద్వారా మొత్తంగా 100000 డాలర్లు అంటే 80 లక్షలకుపైగా కలెక్షన్లను రాబట్టింది.

నైజాం, ఆంధ్రాలో

నైజాం, ఆంధ్రాలో


సార్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా నైజాంలో 6.7 కోట్లు, సీడెడ్‌లో 2.25 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.15 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 67 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 1.5 కోటత్లు, గుంటూరులో 1.35 కోట్లు, కృష్ణా జిల్లాలో 1 కోటి, నెల్లూరు జిల్లాలో 60 లక్షలతో మొత్తం 16.22 కోట్లు రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

సార్/వాతి సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. తమిళనాడులో 18.5 కోట్లు, తెలుగులో 15 కోట్లకుపైగా, కర్ఠాటకలో 4 కోట్లకుపైగా, కేరళలో 50 లక్షలు, మిగితా రాష్ట్రాల్లో 60 లక్షలు, ఓవర్సీస్‌లో 10 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం 40 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

ధనుష్ నటించిన సార్ (వాతి చిత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. 38 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో జర్నీ ప్రారంభించిన ఈ చిత్రం మూడో రోజు 40 కోట్లకుపైగా సవూళ్లను సాధించింది. ఇంకా ఓవర్సీస్‌లో ముఖ్యంగా సోమవారం కూడా హాలీవుడ్ కావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X