Sita Ramam Collections బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా వసూళ్లు.. 15వ రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?
టాలీవుడ్‌లో వెండితెర దృశ్యకావ్యంలా రూపొందిన సీతారామం చిత్రం గత 15 రోజులుగా భారీ వసూళ్లను నమోదు చేసింది. గత రెండు వారాల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 16.80 కోట్ల షేర్, రూ.29.7 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేయడం విశేషంగా మారింది. ఇక సీతారామం సినిమా 15 రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
సీతారామం చిత్రం 15వ రోజున తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో 22 లక్షలు, సీడెడ్‌లో 3 లక్షలు, ఉత్తరాంధ్రలో 8 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 4 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 3 లక్షలు, గుంటూరులో 4 లక్ష్లలు, కృష్ణా జిల్లాలో 4 లక్షలు, నెల్లూరు జిల్లాలో 2 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 15వ రోజున 50 లక్షల షేర్, 90 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో తెలుగు వెర్షన్ 1.95 కోట్లు రాబట్టింది. ఇతర భాషల్లో 5.70 కోట్ల షేర్ సాధించింది. ఓవర్సీస్‌లో 5.90 కోట్ల షేర్ రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 30.50 కోట్ల షేర్, 65 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
సీతారామం సినిమా విడుదలకు ముందు 16.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా 17 కోట్ల లక్ష్యంగా బరిలోకి దిగింది. వారం రోజుల్లోనే ఈ సినిమా లాభాల్లోకి చేరుకొన్నది. ప్రస్తుతం 13.5 కోట్ల లాభంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ కొనసాగుతున్నది. ఇటీవల కాలంలో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకొన్న సినిమాల జాబితాలో సీతారామం చేరింది.


Click it and Unblock the Notifications











