Sita Ramam day 12 Collections యూఎస్‌లో మరో రికార్డు.. అన్ని భాషల్లో బ్లాక్‌బస్టర్.. ఎన్ని కోట్ల లాభమంటే?
హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ సేన్ జంటగా రష్మిక మందన్న కీలక పాత్రలో నటించిన సీతారామం సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. గత 11 రోజుల్లో భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం 12వ రోజున ఏ రేంజ్ కలెక్షన్లను అందుకొన్నదనే విషయంలోకి వెళితే..

మిలియన్ డాలర్ క్లబ్‌లో
అమెరికాలో సీతారామం సినిమా చిత్రానికి భారీ రెస్పాన్స్ లభించింది. అందమైన ప్రేమ కథగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభించింది. దాంతో ఈ చిత్రం మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరింది. గత 12 రోజుల్లో ఈ చిత్రం 1.1 మిలియన్ డాలర్లకుపైగా వసూలు చేసింది. ఇంకా రెండో వారంలో కూడా స్ట్రాంగ్‌గా వసూళ్లను సాధిస్తున్నది.

కేరళ, తమిళనాడులో
సీతారామం సినిమాకు కేరళ, తమిళనాడులో కూడా భారీగా వసూళ్లు నమోదయ్యాయి. తొలుత కాస్త తక్కువ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం మౌత్ టాక్‌తో భారీ వసూళ్లను సొంతం చేసుకొన్నది. కేరళలో 6 కోట్ల గ్రాస్ వసూళ్లను, తమిళనాడులో 7 కోట్ల వసూళ్లను సొంతం చేసుకొన్నది.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు
సీతారామం చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజున నైజాంలో 32 లక్షలు, సీడెడ్‌లో 3 లక్షలు, ఉత్తరాంధ్రలో 9 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 5 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 లక్షలు, గుంటూరు జిల్లాలో 4 లక్షలు, కృష్ణా జిల్లాలో 4 లక్షలు, నెల్లూరు జిల్లాలో 2 లక్షల వసూళ్లను సాధించింది. 12వ రోజున మొత్తంగా 62 లక్షల షేర్, 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

12 రోజుల్లో నైజాం, ఆంధ్రాలో
గత 12 రోజుల్లో సీతారామం నైజాంలో 6.33 కోట్లు, సీడెడ్‌లో 1.50 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.45 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 1.37 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 92 లక్షలు, గుంటూరు జిల్లాలో 1.08 కోట్లు, కృష్ణా జిల్లాలో 1.27 కోట్లు, నెల్లూరు జిల్లాలో 62 లక్షల కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 15.52 కోట్ల షేర్, 27.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
తెలుగేతర రాష్ట్రాల్లో కూడా సీతారామం చిత్రాన్ని ప్రేక్షకుల భారీగా ఆదరించారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాలో ఈ చిత్రం 1.74 కోట్లు, ఇతర భాషల్లో 4.8 కోట్లు, ఓవర్సీస్‌లో 9 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 27.16 కోట్ల షేర్, 54.35 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

సీతారామంకు ఎన్ని కోట్ల లాభమంటే?
సీతారామం చిత్రం విడుదలకు ముందు 16.2 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వ్యాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమాల్లోకి రావాలంటే కనీసం 17 కోట్లు వసూలు చేయాల్సిందని ట్రేడ్ వర్గాలు తేల్చాయి. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఇప్పటికే 10.61 కోట్ల లాభాన్నిఆర్జించింది. ఇటీవల కాలంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది.


Click it and Unblock the Notifications











