Sita Ramam day 14 Collections భారీగా తగ్గిన కలెక్షన్లు.. అయినా ఎన్ని కోట్ల లాభమంటే?
దుల్కర్ సల్మాన్, మృణాల్ సేన్ జంటగా రష్మిక మందన్న కీలక పాత్రలో నటించిన సీతారామం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను నమోదు చేసింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రం గత రెండు వారాలుగా అనేక అవరోధాలను అధిగమించి కలెక్షన్లను సాధించడమే కాకుండా లాభాల జోన్‌లోకి ప్రవేశించింది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్, స్వప్న దత్ నిర్మాణ సారథ్యంలో హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా 14వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

14వ రోజున సీతారామం
సీతారామం చిత్రం 14వ రోజున అంతంతా మాత్రంగానే కలెక్షన్లను సాధించింది. నైజాంలో 19 లక్షల షేర్, సీడెడ్‌లో 2 లక్షలు, ఉత్తరాంధ్రలో 5 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 2 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 లక్షలు, గుంటూరు జిల్లాలో 2 లక్షలు, కృష్ణా జిల్లాలో 2 లక్షలు, నెల్లూరు జిల్లాలో 1 లక్ష షేర్ సంపాదించింది. దాంతో 14వ రోజున 36 లక్షల షేర్, 60 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

14 రోజుల మొత్తం కలెక్షన్లు
ఇక సీతారామం సినిమా గత 14 రోజుల్లో సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి. ఈ చిత్రం నైజాంలో 6.76 కోట్ల షేర్, సీడెడ్‌లో 1.54 కోట్ల షేర్, ఉత్తరాంధ్రలో 2.54 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 1.43 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 96 లక్షలు, గుంటూరు జిల్లాలో 1.12 కోట్లు, కృష్ణా జిల్లాలో 1.31 కోట్లు, నెల్లూరు జిల్లాలో 64 లక్షల వసూళ్లు సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
గత 14 రోజుల్లో ఏపీ, నైజాంలో 16.3 కోట్ల షేర్, 28.8 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో తెలుగు వెర్షన్‌కు 1.86 కోట్లు, ఇతర భాషల వెర్షన్‌కు రూ.5.45 కోట్ల షేర్, ఓవర్సీస్‌లో 5.75 కోట్ల వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం 29.36 కోట్ల షేర్, 58.16 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో
సీతారామం సినిమా విడుదలకు ముందు 16.2 కోట్ల మేర బిజినెస్ చేసింది. దాంతో ఈ చిత్రానికి 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ట్రేడ్ వర్గాలు నిర్ణయించాయి. అయితే తొలి రోజు నుంచే ఈ చిత్రం భారీగా వసూళ్లను సాధించడంతో వారం రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది.

12 కోట్లకుపైగా లాభంతో
గత కొద్ది నెలలుగా థియేటర్‌కు రాలేని సమయంలో సీతారామం చిత్రం ఫీల్‌గుడ్‌గా ఉండటంతో థియేటర్లు ఆడియెన్స్‌తో పోటెత్తాయి. దాంతో భారీ లాభాలను ఈ చిత్రం నమోదు చేసుకొన్నది. ప్రస్తుతం ఈ సినిమా 12.36 కోట్ల లాభాలను నమోదు చేసుకొన్నది. ఇటీవల కాలంలో భారీ లాభాలను సాధించిన చిత్రంగా సీతారామం నిలిచింది.


Click it and Unblock the Notifications











