Sita ramam day 3 official collections కుమ్మేసిన కలెక్షన్లు.. మూడో రోజు వసూళ్లు ఎంతంటే?
సీతారామం చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నది. తొలి రోజు ఓ మోస్తారు వసూళ్లను నమోదు చేసిన ఈ చిత్రం రెండు, మూడు రోజుల్లో గణనీయమైన కలెక్షన్లను రాబడుతున్నది. దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో నిర్మాతలు అశ్వినీదత్, స్వప్న రూపొందించిన ఈ చిత్రం ఫీల్‌గుడ్ మూవీగా ప్రేక్షకులు, సినీ విమర్శకుల చేత ప్రశంసలు అందుకొంటున్నది. ఈ సినిమా మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...

తొలి రెండు రోజుల్లో
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం తొలి రోజున 1.5 కోట్ల షేర్‌ను తెలుగు రాష్ట్రాల్లో నమోదు చేసింది. రెండో రోజు 100 శాతం పెరిగి 2.08 కోట్లు రాబట్టింది. ఇక మూడో రోజున కూడా భారీగా 2.62 కోట్ల షేర్ సొంతం చేసుకొన్నది.

మూడో రోజు అమెరికాలో
ఇక అమెరికాలో సీతారామం సినిమాకు భారీ స్పందన లభిస్తున్నది. యూఎస్‌లో గత మూడు రోజుల్లో భారీగా వసూళ్లను నమోదు చేస్తున్నది. ఇప్పటి వరకు 600k అంటే హాఫ్ మిలియన్ డాలర్లను వసూలు చేసింది. త్వరలోనే ఈ చిత్రం మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరే అవకాశం కనిపిస్తున్నది.

మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో
ఇక తెలుగు రాష్ట్రాల్లో సీతారామం మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 1.15 కోట్లు, సీడెడ్‌లో 28 లక్షలు, ఉత్తరాంధ్రలో 30 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 22 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 20 లక్షలు, గుంటూరులో 17 లక్షలు, కృష్ణా జిల్లాలో 20 లక్షలు, నెల్లూరులో 10 లక్షల రూపాయలతో 5.10 కోట్ల గ్రాస్, 2.62 కోట్ల షేర్ వసూలు చేసింది.

సీతారామం మూడు రోజుల కలెక్షన్లు
సీతారామం సినిమా గత మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 2.54 కోట్లు, సీడెడ్‌లో 65 లక్షలు, ఉత్తరాంధ్రలో 85 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 56 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 40 లక్షలు, గుంటూరు జిల్లాలో 47 లక్షలు, కృష్ణా జిల్లాలో 50 లక్షలు, నెల్లూరు జిల్లాలో 23 లక్షలు వసూలు చేసింది. దీంతో గత మూడు రోజుల్లో ఈ చిత్రం 11.65 కోట్ల గ్రాస్, 6.20 కోట్ల షేర్ రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు
సీతారామం ఏపీ, నైజాంలో 12.77 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 6 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 1.75 గ్రాస్, కేరళలో 2.14 గ్రాస్, తమిళనాడులో 1.60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 22 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 11.15 కోట్ల షేర్, 22.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం ద్వారా బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది.

సీతారామం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే
ఇక సీతారామం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 16.20 కోట్ల బిజినెస్‌ను అంచనా వేశారు. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 17 కోట్లు సంపాదించాలి. అయితే ఇప్పటికే 11.15 కోట్లు రాబట్టింది. ఇంకా 6 కోట్లు రాబట్ట గలిగితే క్లీన్ హిట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











