Sita Ramam day 4 official collections సీతారామం మూవీకి కలెక్షన్ల వెల్లువ.. 4 రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే?

టాలీవుడ్‌లో ఫీల్‌గుడ్ లవ్ స్టోరిగా, వెండితెర మీద దృశ్యకావ్యంగా రూపొందిన సీతారామం చిత్రం సగటు ప్రేక్షకులను, సినీ విమర్శకులను మెప్పిస్తూ భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. ప్రతీ సినిమాకు టెస్టింగ్‌గా మారే తొలి సోమవారం రోజున కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లను సాధించింది. భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా సీతారామం నాలుగో రోజున ఎంత సాధించిందంటే..

తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో షేర్

తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో షేర్


సీతారామం సినిమాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల కలెక్షన్లను పరిశీలిస్తే.. తొలి రోజున 1.5 కోట్లు, రెండో రోజున 2.08 కోట్ల, మూడో రోజున 2.362 కోట్ల షేర్ సాధించింది. ఇక నాలుగో రోజున తొలి రోజుకు సమానంగా 1.46 కోట్ల షేర్ సాధించింది. దాంతో ఈ చిత్రం నైజాం, ఆంధ్రాలో కలిపి 7.66 కోట్ల షేర్, 14.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

4వ రోజున నైజాం, ఆంధ్రాలో

4వ రోజున నైజాం, ఆంధ్రాలో

సీతారామం చిత్రం 4వ రోజున సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో 56 లక్షలు, సీడెడ్‌లో 18 లక్షలు, ఉత్తరాంధ్రలో 24 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 14 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 8 లక్షలు, గుంటూరు జిల్లాలో 9 లక్షలు, కృష్ణా జిల్లాలో 11 లక్షలు, నెల్లూరు జిల్లాలో 6 లక్షల వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 1.46 కోట్ల షేర్, 2.6 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా

తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా

సీతారామం సినిమా గత నాలుగు రోజుల్లో నైజాం ప్రాంతంలో 3.10 కోట్లు, సీడెడ్‌లో 83 లక్షలు, ఉత్తరాంధ్రలో 1.09 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 70 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 48 లక్షలు, గుంటూరు జిల్లాలో 56 లక్షలు, కృష్ణా జిల్లాలో 61 లక్షలు, నెల్లూరు జిల్లాలో 29 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 7.66 కోట్ల షేర్, 14.25 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

సీతారామం ఓవర్సీస్‌లో

సీతారామం ఓవర్సీస్‌లో

ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో 100k డాలర్ల క్లబ్‌లో చేరింది. అమెరికాలో 600k డాలర్లకుపైగా వసూలు చేసింది. దీంతో ఓవర్సీస్‌లో ఈ చిత్రం 3.15 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. ఇంకా పలు దేశాల్లో చాలా స్రాంగ్‌గా కొనసాగుతున్నది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు


సీతారామం చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 3.05 కోట్ల షేర్, 6 కోట్లకుపైగా గ్రాస్, రెండో రోజున 3.63 కోట్ల షేర్, 7.25 కోట్ల గ్రాస్, మూడో రోజున 4.47 కోట్ల షేర్, 8.90 కోట్ల గ్రాస్, 4వ రోజున 2.46 కోట్ల షేర్, 4.80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 13.61 కోట్ల షేర్, 27 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

సీతారామం ప్రాఫిట్‌లోకి రావాలంటే

సీతారామం ప్రాఫిట్‌లోకి రావాలంటే

ఇదిలా ఉండగా, సీతారామం సినిమా 16.2 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 17 కోట్లు రాబట్టాల్సింది. అయితే ఈ చిత్రం ఇంకా 2.4 కోట్ల కలెక్షన్లు రాబట్టగలిగితే క్లీన్ హిట్‌గా మారుతుంది. ఈ వారంలో సీతారామం లాభాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X