twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam day 5 Collections లాభాల్లోకి ప్రవేశించిన సీతారామం.. యూఎస్‌లో రికార్డుకు చేరువగా!

    |

    సినీ విమర్శకులు, ప్రముఖులు, సాధారణ ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటున్న సీతారామం చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధిస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర భాషల్లోను, అలాగే ఓవర్సీస్ మార్కెట్‌లోను భారీగా వసూళ్లను సాధిస్తున్నది. గత నాలుగు రోజుల్లో సాధిస్తున్న కలెక్షన్లకు ధీటుగా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతున్నది. ఇక 5 రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

    అమెరికాలో 1 మిలియన్ మార్కు

    అమెరికాలో 1 మిలియన్ మార్కు

    ఓవర్సీస్‌లో పబ్లిక్ డిమాండ్ పెరుగుతుండటంతో పలు దేశాల్లో సీతారామం సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాత అశ్వినీదత్, స్వప్న ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 11వ తేదీన గల్ఫ్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అలాగే పలు దేశాల్లో షోలు పెంచుతున్నారు.

    ఇలాంటి పరిస్థితుల్లో సీతారామం చిత్రం అమెరికాలో 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది. యూఎస్‌లో ఈ చిత్రం 900k సాధిస్తే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది.తొలి వారాంతానికి అమెరికాలో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం ఇప్పటికే 3.6 కోట్లు సాధించింది.

    తమిళనాడులో 5వ రోజు

    తమిళనాడులో 5వ రోజు

    తమిళనాడులో సీతారామం వివిధ వెర్షన్లకు భారీ స్పందన లభిస్తున్నది. 5వ రోజున తమిళనాడులో తెలుగు వెర్షన్‌ 1.29 లక్షలు, మలయాళం 17 వేలు, తమిళంలో 38 వేలు కలెక్ట్ చేసింది. వర్కింగ్ డే రోజున 2336 షోలు ప్రదర్శించగా 15 చోట్ల హౌస్‌ఫుల్స్ లభించాయి.

    తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు

    తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు

    తెలుగు రాష్ట్రాల్లో సీతారామం సినిమా 5వ రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో 65 లక్షలు, సీడెడ్‌లో 20 లక్షలు, ఉత్తరాంధ్రలో 29 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 16 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 లక్షలు, గుంటూరు జిల్లాలో 11 లక్షలు, కృష్ణా జిల్లాలో 14 లక్షలు, నెల్లూరు జిల్లాలో 7 లక్షలు వసూలు చేసింది. దాంతో 1.70 కోట్ల షేర్, 3.10 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి.

    5 రోజుల్లో టోటల్ కలెక్షన్లు

    5 రోజుల్లో టోటల్ కలెక్షన్లు

    ఇక సీతారామం మూవీకి సంబంధించిన గత 5 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాం, ఆంధ్రాలో తొలి రోజు 1.5 కోట్లు, రెండో రోజున 2.08 కోట్లు, మూడో రోజున 2.62 కోట్లు, నాలుగ రోజున 1.46 కోట్లు, ఐదో రోజున 1.71 కోట్లతో మొత్తంగా 9.37 కోట్ల షేర్, 17.35 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో

    కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో

    ఇక సీతారామం సినిమా ఇతర భాషల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 90 లక్షలు, ఇతర భాషల్లో 2.6 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో 3.60 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 16.47 కోట్లు షేర్, 32.6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    Recommended Video

    NASA అంతరిక్షంలోకి Athira Preeta Rani... ఎవరీమె? *Trending | Telugu OneIndia
    లాభాల్లోకి ప్రవేశించిన సీతారామం

    లాభాల్లోకి ప్రవేశించిన సీతారామం

    సీతారామం బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ భారీగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 16.20 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. 17 కోట్ల రాబట్టాల్సి ఉంది. అయితే ఈ చిత్రం దాదాపు బ్రేక్ ఈవెన్ స్థాయిని చేరుకొన్నది. ఈ సినిమా 6వ రోజు నుంచి లాభాల జోన్‌లోకి ప్రవేశిస్తుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    English summary
    Malayalam actor Dulquer Salmaan, Bollywood actor Mrunal Thakur starrer Sita Ramam has Rashmika Mandanna in an important role. Sita Ramam day3 is the best day for the movie at box office , In Most of the Centres day3 collections are almost double of opening day. 1st weekend Telugu version share is close to 16.5Cr. Very good weekend
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X