For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sita Ramam హిందీలోనూ సూపర్‌హిట్.. మౌత్‌టాక్​‌తో పెరగనున్న వసూళ్లు.. బాలీవుడ్‌కు మరో షాక్..

  |

  దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసికల్ లవ్ స్టోరీ.. సీతా రామం. ఆగస్టు 5న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. తెలుగు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. హృద్యమైన ప్రేమ కథ, అద్భుతమైన నటన, శ్రావ్యమైన సంగీతం కలబోతతో అందమైన ప్రేమకావ్యంగా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించింది.. సీతా రామం. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం ఆరవ వారంలోనూ మంచి కలెక్షన్లను సాధిస్తోంది.

  హిందీలోనూ సూపర్ హిట్..

  హిందీలోనూ సూపర్ హిట్..

  తాజాగా సీతా రామం శుక్రవారమే హిందీలో విడుదలైంది. హిందీలో ఆర్ఆర్ఆర్ సహా అనేక పెద్ద చిత్రాలకు నిర్మాతలుగా ఉన్న జయంతిలాల్ గడా ఈ చిత్రాన్ని ఉత్తరాదిలో విడుదల చేశారు. తొలుత పరిమిత సంఖ్యలోని థియేటర్లలోనే రిలీజ్ చేయగా.. ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోందని తెలుస్తోంది.

  యూనానిమస్ హిట్..

  యూనానిమస్ హిట్..

  ఈ సినిమాకు హిందీలో విమర్శకులు మంచి రివ్యూలు ఇస్తున్నారు. మౌత్ టాక్ కూడా చాలా పాజిటివ్‌గా ఉన్నట్లు సమాచారం. బుకింగ్స్ కూడా ఎంతో పాజిటివ్‌గా ఉన్నాయి. మౌత్‌టాక్ పెరిగి.. వీకెండ్లో బుకింగ్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. దీంతో సీతా రామం.. యునానిమస్ హిట్‌గా నిలిచినట్లు అయ్యింది. రిలీజైన ప్రతి భాషలో సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం బంపర్ హిట్‌గా దూసుకుపోతోంది

  ఎల్లలు దాటిన ప్రేమకథ..

  ఎల్లలు దాటిన ప్రేమకథ..

  భాష పరమైన అడ్డంకులను అధిగమించి.. ఎల్లలు దాటిన ప్రేమ కథగా నిలిచింది సీతారామం. యుద్ధంతో రాసిన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతినిస్తోంది. ముఖ్యంగా దుల్కర్, మృణాల్ నటనను ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఇక చాలా ఏళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్న హను కూడా ఈ చిత్రంతో దర్శకుడిగా మరో స్థాయికి చేరుకున్నారని చెప్పొచ్చు.

  ఏకైక చిత్రం ఇదే..

  ఏకైక చిత్రం ఇదే..

  సినిమాకు విశాల్ చంద్ర శేఖర్ అందించిన పాటలు ఎంతో వినసొంపుగా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ క్లాసిక్ అనదగ్గ స్థాయిలో ఉంటుంది. పీఎస్ వినోద్ విజువల్స్ సినిమాను అద్భుత దృశ్యకావ్యంగా నిలిపాయి. స్వప్న సినిమా-వైజయంతి మూవీస్ బ్యానర్ల నిర్మాణ విలువలు చాలా గ్రాండ్‌గా ఉండటం సహా సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. ఇవన్నీ కలిసి ఒక మరపులేని చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాయి. ఈ మధ్య కాలంలో మంచి రివ్యూలతో పాటు అదిరిపోయే కలెక్షన్లను దక్కించుకున్న ఏకైక చిత్రం ఇదే అనడంలో సందేహం లేదు.

  బాలీవుడ్‌కు మరో షాక్..

  బాలీవుడ్‌కు మరో షాక్..

  ఈ సినిమా విజయంతో బాలీవుడ్‌కు మరో షాక్ తగిలినట్లు అయ్యింది. ఇప్పటికే వరుస ఫ్లాపులతో హిందీ చిత్ర పరిశ్రమ సతమతమవుతోంది. స్టార్ హీరోల చిత్రాల నుంచి చిన్న సినిమాల వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నాయి. లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్, దొబారా సహా ఇందుకు ఉదాహరణగా ఎన్నో చిత్రాలున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో ఉత్తరాదిన మన చిత్రాల హవా కొనసాగడం విశేషం. గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీయఫ్, పుష్ప వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్‌లుగా నిలుస్తే.. ఇటీవలే కార్తికేయ 2, ఇప్పుడు సీతారామం కూడా ఆ లిస్ట్‌లో చేరిపోయాయి.

  English summary
  Dulquer Salmaan and Mrunal Thakur's Classical Love Story Sita Ramam had its Hindi release on Friday. It Gets Rave Reviews And Excellent Openings In Hindi
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X