twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam 25 Days Collections: సోమవారం డీసెంట్ కలెక్షన్స్.. ప్రాఫిట్స్ అంటే ఇలా ఉండాలి!

    |

    వైజయంతి మూవీస్ నిర్మించిన అద్భుతమైన ప్రేమ కావ్యం సీతారామం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రాఫిట్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. థియేటర్లోకి జనాలు రావడం లేదు అని అనుకుంటున్న తరుణంలో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా భారీ స్థాయిలోనే రప్పించింది. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే ఎగబడి సినిమాలు చూస్తారు అని కూడా ఈ సినిమా నిరూపించింది. ఇక మొత్తానికి ఈ సినిమా ధియేటర్లోకి వచ్చి 25 రోజులను పూర్తి చేసుకుంది. ఇక 25వ రోజు కూడా ఊహించిన విధంగా డీసెంట్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి ఎంత ప్రాఫిట్ అందించింది.. అనే వివరాల్లోకి వెళితే..

     ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రీ రిలీజ్ బిజినెస్

    హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'సీతా రామం' మూవీకి మంచి బిజినెస్ జరిగింది. ఇక నైజాంలో ఈ రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేయగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా మూవీకి రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

     25వ రోజు ఆంధ్ర, నైజాం కలెక్షన్స్

    25వ రోజు ఆంధ్ర, నైజాం కలెక్షన్స్

    ఇక తెలంగాణలో 25వ రోజు 'సీతా రామం' మూవీకి కలెక్షన్లు కొంత తగ్గాయి. ఇక ఏరియాల వారిగా సోమవారం రోజు వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్ష, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1లక్ష, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్ష, నెల్లూరులో రూ. 1 లక్షతో కలిపి ఈ మూవీ రూ. 25 లక్షలు షేర్, రూ. 44 లక్షల గ్రాస్ వసూలు చేసింది.

    25 రోజుల టోటల్ కలెక్షన్స్

    25 రోజుల టోటల్ కలెక్షన్స్

    25 రోజుల్లో ఏపీ, తెలంగాణలో 'సీతా రామం' సినిమా మంచి కలెక్షన్లు అందుకుంది. ఇక మొత్తం ఏరియాల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 9.17 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.84 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.35 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.86 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.20 కోట్లు, గుంటూరులో రూ. 1.50 కోట్లు, కృష్ణాలో రూ. 1.66 కోట్లు, నెల్లూరులో రూ. 83 లక్షలతో కలిపి రూ. 21.41 కోట్లు షేర్, రూ. 37.85 కోట్లు గ్రాస్ వసూలైంది.

     ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచవ్యాప్తంగా

    ఇక 25 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 21.41 కోట్లు రాబట్టిన 'సీతా రామం' సినిమా ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.66 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.70 కోట్లు, మిగితా భాషల్లో రూ. 6.68 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 25 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 38.65 కోట్లు షేర్‌‌, రూ. 77.90 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

    డబుల్ ప్రాఫిట్ కంటే ఎక్కువగా..

    డబుల్ ప్రాఫిట్ కంటే ఎక్కువగా..

    హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా వచ్చిన 'సీతా రామం' సినిమా అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ చేయగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 25 రోజుల్లోనే సీతారామం సినిమా రూ. 38.65 కోట్లు వసూలు చేసింది. దీంతో సినిమా పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్ కంటే ఎక్కువగా రూ. 21.65 కోట్లు అంధించింది.

    English summary
    Sita Ramam telugu movie worldwide 25 Days Collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X