Sitaare Day 1 Ccollections: సితారే జమీన్ పర్ బడ్జెట్ ఎంత? అమీర్ ఖాన్ కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ నటించడమే కాకుండా నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం సితారే జమీన్ పర్. 2007 సంవత్సరంలో రిలీజై భారీ విజయం అందుకొన్న తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా దేశ్ ముఖ్ కీలక పాత్రల్లో నటించింది. ఈ సినిమాకు అపర్ణ పురోహిత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. హాలీవుడ్‌లో 2018 సంవత్సరంలో రిలీజైన స్పానిష్ మూవీ ఛాంపియన్స్ సినిమా ఆధారంగా సితారే జమీన్ పర్ మూవీని రూపొందించారు.
అమీర్ ఖాన్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాలో ఎక్కువగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టెలివిజన్ ఆర్టిస్టులు, నూతన నటులు నటించారు. ఈ సినిమాకు జీ శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రఫి, మ్యూజిక్ శంకర్, ఎహసాన్, లాయ్, రామ్ సంపత్ తదితరులు అందించారు. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

హిందీ సినిమా రంగంలో బాక్సాఫీస్ వద్ద అమీర్ ఖాన్‌ది ఘనమైన చరిత్రనే ఉంది. ఇండియన్ సినిమాకు తొలి 100 కోట్ల రూపాయల కలెక్షన్లను తాను నటించిన గజనీ సినిమా ద్వారా అందించారు. ఇక 3 ఇడియెట్ మూవీతో 200 కోట్ల రూపాయల క్లబ్ కూడా అమీర్ ఖాతాలోనే ఉంది. ఇక పీకే మూవీతో భారతీయ సినిమాకు 300 కోట్ల రూపాయల క్లబ్ ఎలా ఉంటుందో అని కలెక్షన్ల రుచి చూపించారు. అలాంటి హీరోకు పరాజయాలు భారీగా దెబ్బ కొట్టాయి.
గత కొద్ది సంవత్సరాలుగా అమీర్ ఖాన్ సినిమా కెరీర్ అనేక ఒడిదుడుకులకు లోనవుతున్నది. సితారే జమీన్ పర్ సినిమాకు ముందు దాదాపు మూడు, నాలుగు సినిమాలు దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. సీక్రెట్ సూపర్ స్టార్, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, లాల్ సింగ్ చద్దా సినిమా డిజాస్టర్లుగా మారాయి. ఇలాంటి సమయంలో తన సత్తాను నిరూపించుకొనేందుకు సితారే జమీన్ పర్ సినిమాతో ముందుకు వస్తున్నారు. ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ పండితులు వెల్లడించారు.
అయితే భారీగా ప్రమోషన్స్ నిర్వహించినప్పటికీ సితారే జమీన్ పర్ సినిమాకు పెద్దగా ఓపెనింగ్స్ కనిపించడం లేదు. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ అంత గొప్పగా కనిపించలేదు. దాంతో ఈ మూవీకి తొలి రోజు బాక్సాఫీస్ వద్ద చాలా తక్కువగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ మూవీ సుమారుగా 8 నుంచి 10 కోట్ల మధ్య వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో అమీర్ నటించిన థగ్ లైఫ్ సినిమా తొలి రోజు 50 కోట్లు వసూలు చేయడం తెలిసిందే


Click it and Unblock the Notifications











