Sitaare Zameen Par Box Office: 200 కోట్ల క్లబ్‌లో సితారే జమీన్ పర్.. అమీర్ ఖాన్ సరికొత్త రికార్డు ఏమిటంటే?

ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ నటించడమే కాకుండా నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం సితారే జమీన్ పర్. 2007 సంవత్సరంలో రిలీజై భారీ విజయం అందుకొన్న తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా దేశ్ ముఖ్ కీలక పాత్రల్లో నటించింది. ఈ సినిమాకు అపర్ణ పురోహిత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. హాలీవుడ్‌లో 2018 సంవత్సరంలో రిలీజైన స్పానిష్ మూవీ ఛాంపియన్స్ సినిమా ఆధారంగా సితారే జమీన్ పర్ మూవీని రూపొందించారు.

అమీర్ ఖాన్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాలో ఎక్కువగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టెలివిజన్ ఆర్టిస్టులు, నూతన నటులు నటించారు. ఈ సినిమాకు జీ శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రఫి, మ్యూజిక్ శంకర్, ఎహసాన్, లాయ్, రామ్ సంపత్ తదితరులు అందించారు. తారే జమీన్ పర్ మూవీకి సీక్వెల్‌గా సితారే జమీన్ సినిమా రూపొందింది. ఈ సినిమాకు స్పానిష్ మూవీ క్యాంపేవన్స్ సినిమా స్పూర్తి. అమీర్ ఖాన్ నిర్మాతగా మారి ఈ సినిమాను సుమారుగా 90 కోట్ల రూపాయలతో రూపొందించారు.

Sitaare Zameen Par Box Office

ఈ సినిమాను అమీర్ ఖాన్ సొంతంగా రిలీజ్ చేశారు. ఈ మూవీని ఓటీటీ బిజినెస్ కూడా చేయకపోవడం గమనార్హం. ఇక ఈ చిత్రాన్ని ఇండియాలో 3500 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 4200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం ఈ చిత్రం 100 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లు బాక్సాఫీస్ వద్ద సాధించాల్సి ఉంటుంది. ఈ సినిమా భారీ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

సితారే జమీన్ పర్ చిత్రం తొలి రోజు 11 కోట్ల రూపాయలతో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. ఈ సినిమా రెండో రోజు డబుల్ వసూళ్లను సాధించి.. 20 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. ఇక ఈ చిత్రం మూడో రోజు కూడా సత్తా చాటుతూ తొలి రెండు రోజుల కంటే ఎక్కువగా 27 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో మూడు రోజుల్లోనే 59 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. ఇక తొలివారం ముగిసే సమయానికి 89 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

సితారే జమీన్ పర్ చిత్రం రెండో వారంలో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. 2వ వారంలో 8వ రోజు 7 కోట్లు, 9వ రోజు 12.5 కోట్లు, 10వ రోజు 14.5 కోట్లు, 11వ రోజు 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండోవారంలో ఇప్పటి వరకు 38 కోట్లు రాబట్టింది. గత 12 రోజుల్లో ఈ సినిమా 127 కోట్లకుపైగా నెట్, 147 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో 51 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా 198 కోట్లకుపైగా కలెక్షన్లు వసూలు చేసింది.

ఇక 12వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నది. ఈ సినిమా రెండో మంగళవారం సుమారుగా 3 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా 200 కోట్ల మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. ఈ చిత్రం అమీర్ ఖాన్ కెరీర్‌లో 8వ 100 కోట్ల చిత్రంగా ఘనతను సొంతం చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X