Sitaare Zameen Par Box Office: 250 కోట్లకు చేరువగా సితారే జమీన్ పర్.. తన రికార్డును బ్రేక్ చేసిన అమీర్ ఖాన్!
ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ నటించడమే కాకుండా నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం సితారే జమీన్ పర్. 2007 సంవత్సరంలో రిలీజై భారీ విజయం అందుకొన్న తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా దేశ్ ముఖ్ కీలక పాత్రల్లో నటించింది. ఈ సినిమాకు అపర్ణ పురోహిత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. హాలీవుడ్‌లో 2018 సంవత్సరంలో రిలీజైన స్పానిష్ మూవీ ఛాంపియన్స్ సినిమా ఆధారంగా సితారే జమీన్ పర్ మూవీని రూపొందించారు. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
అమీర్ ఖాన్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాలో ఎక్కువగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టెలివిజన్ ఆర్టిస్టులు, నూతన నటులు నటించారు. ఈ సినిమాకు జీ శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రఫి, మ్యూజిక్ శంకర్, ఎహసాన్, లాయ్, రామ్ సంపత్ తదితరులు అందించారు. తారే జమీన్ పర్ మూవీకి సీక్వెల్‌గా సితారే జమీన్ సినిమా రూపొందింది. ఈ సినిమాకు స్పానిష్ మూవీ క్యాంపేవన్స్ సినిమా స్పూర్తి. అమీర్ ఖాన్ నిర్మాతగా మారి ఈ సినిమాను సుమారుగా 90 కోట్ల రూపాయలతో రూపొందించారు.

ఈ సినిమాను అమీర్ ఖాన్ సొంతంగా రిలీజ్ చేశారు. ఈ మూవీని ఓటీటీ బిజినెస్ కూడా చేయకపోవడం గమనార్హం. ఇక ఈ చిత్రాన్ని ఇండియాలో 3500 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 4200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం ఈ చిత్రం 100 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లు బాక్సాఫీస్ వద్ద సాధించాల్సి ఉంటుంది. ఈ సినిమా భారీ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
సితారే జమీన్ పర సినిమా భారీ ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. తొలి రోజు 11 కోట్లు, రెండో రోజు 20 కోట్లు, మూడో రోజు 27.25 కోట్లు వసూలు చేసింది. తొలివారాంతంలోనే 58 కోట్లకుపగా వసూళ్లను రాబట్టింది. ఇక తొలివారం ముగిసే సమయానికి హిందీ వెర్షన్ 88 కోట్ల రూపాయలు, తమిళంలో 55 లక్షలు, తెలుగులో 35 లక్షలు వసూలు చేసింది. దాంతో తొలి వారం 89 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక రెండొ వారంలో కూడా అమీర్ ఖాన్ తన సత్తాను బాక్సాఫీస్ వద్ద నిరూపించుకొన్నారు. వారాంతంలో భారీగా అంటే రెండో శనివారం 13 కోట్లు, రెండో ఆదివారం 15 కోట్ల మేర వసూళ్లను సాధించింది. ఇక రెండోవారం ముగిసే సమయానికి హిందీలో 46 కోట్ల రూపాయలు, తమిళంలో 20 లక్షలు, తెలుగులో 10 లక్షలు వసూలు చేసింది. దాంతో రెండో వారంలో 40.3 కోట్లు వసూలు చేసింది.
ఇక మూడో వారంలో మూడో గురువారం నాటికి ఈ సినిమా 154 కోట్ల రూపాయలు ఆర్జించింది. హిందీలో 153 కోట్ల రూపాయలు, తమిళంలో 80 లక్షలు, తెలుగులో 45 లక్షల రూపాయలు వసూలు చేసింది. అయితే అమీర్ ఖాన్ ఇటీవల కాలంలో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే ఆ సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్లను ఈ సినిమా 20 రోజుల్లోనే అధిగమించింది.
ఇదిలా ఉండగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 154 కోట్ల రూపాయలు నెట్, 184 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో రికార్డు లెవెల్‌లో 54 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గ 238 కోట్ల రూపాయలు నమోదు చేసింది. త్వరలోనే ఈ చిత్రం 250 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











