Sitaare Day 3 Ccollections: సితారే జమీన్ పర్ సినిమాకు షాకింగ్ కలెక్షన్లు.. అమీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ నటించడమే కాకుండా నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం సితారే జమీన్ పర్. 2007 సంవత్సరంలో రిలీజై భారీ విజయం అందుకొన్న తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా దేశ్ ముఖ్ కీలక పాత్రల్లో నటించింది. ఈ సినిమాకు అపర్ణ పురోహిత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. హాలీవుడ్‌లో 2018 సంవత్సరంలో రిలీజైన స్పానిష్ మూవీ ఛాంపియన్స్ సినిమా ఆధారంగా సితారే జమీన్ పర్ మూవీని రూపొందించారు.
అమీర్ ఖాన్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాలో ఎక్కువగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టెలివిజన్ ఆర్టిస్టులు, నూతన నటులు నటించారు. ఈ సినిమాకు జీ శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రఫి, మ్యూజిక్ శంకర్, ఎహసాన్, లాయ్, రామ్ సంపత్ తదితరులు అందించారు. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

తారే జమీన్ పర్ మూవీకి సీక్వెల్‌గా సితారే జమీన్ సినిమా రూపొందింది. ఈ సినిమాకు స్పానిష్ మూవీ క్యాంపేవన్స్ సినిమా స్పూర్తి. అమీర్ ఖాన్ నిర్మాతగా మారి ఈ సినిమాను సుమారుగా 90 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని ఇండియాలో 3500 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 4200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం ఈ చిత్రం 100 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లు బాక్సాఫీస్ వద్ద సాధించాల్సి ఉంటుంది. ఈ సినిమా భారీ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొని ఓ మోస్తారు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజు 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక ఈ సినిమాకు వీకెండ్ బాగా కలిసి వచ్చింది. ఈ సినిమాకు పెద్దగా నెగిటివ్ టాక్ లేకపోవడంతో రెండో రోజు 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తొలి రోజు కంటే రెండో రోజు 100 శాతం వృద్ధిని బాక్సాఫీస్ వద్ద చూపించింది. ఇక ఈ చిత్రం మూడో రోజు తొలి రెండు రోజుల కంటే అధికంగా కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం 3వ రోజు 30 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా 60 కోట్లకుపైగా వసూళ్లను సాధించే వకాశం ఉంది.
అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమాకు ఓవర్సీస్‌లో కూడా భారీగా వసూళ్లు రాబడుతున్నది. ఈ చిత్రం ఇప్టపి వరకు 2 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 18 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా లాంగ్ రన్‌లో 4 మిలియన్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే జోష్ కొనసాగితే ఈ చిత్రం తొలి వారంలో 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











