Price Collections: రెండో రోజు కూడా జోరుగా శివ కార్తికేయన్ ప్రిన్స్ కలెక్షన్లు.. ఎంత రావచ్చంటే!
జాతి రత్నాలు మూవీతో క్రేజీ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు దర్శకుడు అనుదీప్ కేవీ. ఇక తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతుందనగానే అంచనాలు పెరిగాయి. దానికి తోడు చేసిన ప్రమోషన్స్ కూడా అంచనాలను మరింతగా పెంచాయి. అనుదీప్, శివ కార్తికేయన్ కాంబినేషన్ లో వచ్చిన ప్రిన్స్ మూవీ ఎట్టకేలకు అక్టోబర్ 21న విడుదలై మంచి ఓపెనింగ్స్ అందుకుంది. సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కెలెక్షన్లు మాత్రం జోరుగా రాబట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమా రెండో రోజు ఎన్ని కలెక్షన్లు రాబట్టనుందనే డీటేల్స్ లోకి వెళితే..

ప్రిన్స్ మూవీ బడ్జెట్..
బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న మీడియం రేంజ్ హీరోలలో తమిళ స్టార్ శివ కార్తికేయన్ ఒకరు. ఆయన నటించిన చివరి రెండు చిత్రాలు కాలేజ్ డాన్, డాక్టర్ వరుణ్ బాక్సాఫీస్ వద్ద వేగంగా రూ. 100 కోట్లు రాబట్టాయి. ఈ రెండు చిత్రాల తర్వాత వస్తున్న మూడో చిత్రం ప్రిన్స్ పై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రిన్స్ మూవీకి రూ. 60 కోట్ల బడ్టెట్ అయినట్లు సమాచారం.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా..
శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమా తమిళంలో రూ. 32 కోట్ల వరకు బిజినెస్ చేయగా 2 తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక కర్ణాటకలో రూ. 2.5 కోట్లు, కేరళలో రూ. 1.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి వరకు బిజినెస్ చేసిన ప్రిన్స్.. ఓవర్సీస్ మొత్తంలో కూడా రూ. 6.50 కోట్ల వరకు ధర పలికినట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రిన్ మూవీ రూ. 50 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

ఫస్ట్ డే కలెక్షన్లు..
ఉక్రేయిన్ ముద్దుగుమ్మ మరియా ర్యాబోషప్కా హీరోయిన్ గా నటించిన ప్రిన్స్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. కర్ణాటకలో రూ. 2 లక్షలు, ఏపీ, తెలంగాణలో రూ. 1.5 కోట్లు, తమిళనాడులో రూ. 5.3 కోట్లు, కేరళలో రూ. 10 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో రూ. 20 లక్షలు వసూలు చేసింది. ఇండియాలో మొత్తంగా తొలి రోజు రూ. 7.3 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్‌లో కలిపి మొత్తంగా రూ. 8 కోట్లు వసూలు చేసింది.

రెండో రోజు థియేటర్ ఆక్యుపెన్సీ..
శివ కార్తికేయన్ హీరోగా ఉక్రేయిన్ భామ మరియా ర్యాబోషప్కా హీరోయిన్ గా అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ప్రిన్స్ మూవీ తొలి రోజు మంచి థియేటర్ ఆక్యుపెన్సీ సాధించింది. ఈ క్రమంలో రెండో రోజు తమిళ భాషలో ఉదయం 24.10% కాగా, మధ్యాహ్నం 32.72%తో మొత్తంగా మధ్యాహ్నాం సమయానికి 56.82 శాతంగా ఆక్యుపెన్సీ నమోదైంది. తెలుగులో రెండో రోజు ఉదయం 18.62 శాతం ఆక్యుపెన్సీ కాగా, మధ్యాహ్నాం 24.63 శాతంగా నమోదైంది. అంటే రెండో రోజు మద్యాహ్నాం సమయానికి తెలుగులో 43.25 థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు చేసింది.

రెండో రోజు కలెక్షన్ల అంచనా ఇలా..
అనుదీప్-శివ కార్తికేయన్ వంటి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ప్రిన్స్ మూవీకి మిక్స్ డ్ టాక్ లభించిన బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా అందిన లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో కలుపుకుని రెండో రోజు రూ. 5 కోట్ల కలెక్షన్లు రావచ్చని సమాచారం. ఇక రెండు రోజులకు కలిపి రూ. 11.25 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











