Price Day 4 Collections: మళ్లీ పుంజుకున్న శివ కార్తికేయన్ 'ప్రిన్స్'.. 4వ రోజు కలెక్షన్లు ఎంతంటే?

టాలీవుడ్ లో జాతిరత్నాలు మూవీతో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనుదీప్ కేవీ. డాక్టర్ వరుణ్, కాలేజ్ డాన్ సినిమాలతో కోలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నిలిచాడు శివ కార్తికేయన్. వీరిద్దరి కాంబినేషన్ లో రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కిన చిత్రం ప్రిన్స్. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాల నడుమ అక్టోబర్ 21న గ్రాండ్ గా విడుదలైంది అనుదీప్-శివ కార్తికేయన్ కాంబో మూవీ ప్రిన్స్. అయితే ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల వసూళ్లలో మాత్రం పర్వాలేదనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రిన్స్ సినిమాకు మూడో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

రూ. 100 కోట్లు రాబట్టిన చివరి 2 చిత్రాలు..

రూ. 100 కోట్లు రాబట్టిన చివరి 2 చిత్రాలు..

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గత రెండు చివరి చిత్రాలతో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ప్రియాంక మోహన్ తో జోడి కట్టిన శివ కార్తికేయన్.. కాలేజ్ డాన్, డాక్టర్ వరుణ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వేగంగా రూ. 100 కోట్లు రాబట్టాయి. ఈ రెండు చిత్రాల తర్వాత వచ్చిన మూడో చిత్రం ప్రిన్స్ పై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రిన్స్ మూవీకి రూ. 60 కోట్ల బడ్టెట్ అయినట్లు సమాచారం.

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

లవ్ అండ్ రొమాన్స్ కి ఫన్ యాడ్ చేస్తూ వచ్చిన ప్రిన్స్ మూవీ తమిళంలో రూ. 32 కోట్ల వరకు బిజినెస్ చేయగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్ల వరకు బిజినెస్ వసూళు చేసింది. ఇక కర్ణాటకలో రూ. 2.5 కోట్లు, కేరళలో రూ. 1.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి వరకు బిజినెస్ చేసిన ప్రిన్స్.. ఓవర్సీస్ మొత్తంలో కూడా రూ. 6.50 కోట్ల వరకు బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రిన్ మూవీ రూ. 50 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

నాలుగో రోజు ఆక్యుపెన్సీ..

నాలుగో రోజు ఆక్యుపెన్సీ..

ప్రిన్స్ సినిమా తమిళంలో రెండో రోజు ఆక్యుపెన్సీ మొత్తంగా 36.86గా నమోదు అయింది. ఏరియా వైస్ గా చూస్తే.. చెన్నైలో 47.75శాతం, కోయంబత్తూరులో 50.25, పాండిచ్చేరిలో 66.75 శాతం, సాలెం 34.25, దిండిగల్ 59.50 శాతం, త్రిచూరులో 67.25 శాతం అక్యుపెన్సీ నమోదైంది. తెలుగులో హైదరాబాద్‌లో 16.25 శాతం, గుంటూరులో 23.50 శాతం, వైజాగ్‌లో 12.75 శాతం, కాకినాడలో 95.50 శాతం, నెల్లూరులో 16.33 శాతం అక్యుపెన్సీ నమోదైంది. ఇక ఓవరాల్ గా తెలుగులో 15.70 శాతం ఆక్యుపెన్సీగా రికార్డ్ అయింది.

నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో..

నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో..

శివ కార్తికేయన్, అనుదీప్ కేవీ కాంబినేషన్ సినిమా ప్రిన్స్ నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 60 లక్షలు వసూలు చేసింది. ఇక నాలుగు రోజులకు కలిపి నైజాంలో రూ. 94 లక్షలు, సీడెడ్ లో రూ. 26 లక్షలు, ఆంధ్రాలో రూ. 117 లక్షలు మొత్తంగా రూ. 2.37 కోట్ల షేర్, రూ. 4.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్ల వరకు బిజినెస్ చేయగా, బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 7 కోట్లు అయింది. ఇంకా రూ. 4.63 కోట్లు రావాల్సి ఉంది.

 దేశవ్యాప్తంగా వచ్చింది ఎంతంటే..

దేశవ్యాప్తంగా వచ్చింది ఎంతంటే..

ఉక్రేయిన్ ముద్దుగుమ్మ మరియా ర్యాబోషప్కా హీరోయిన్ గా నటించిన ఈ ప్రిన్స్ మూవీకి దేశవ్యాప్తంగా నాలుగో రోజు రూ. 4.20 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టినట్లు సమాచారం. ఇక నాలుగు రోజులకు కలుపుకుని మొత్తంగా రూ. 19.50 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X