Prince Collections: రికార్డు దిశగా ప్రిన్స్ కలెక్షన్స్.. శివ కార్తీకేయన్ మూవీకి ఎంత రావచ్చంటే!
ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న మీడియం రేంజ్ హీరోలలో శివకార్తికేయన్ ఒకరు. ఒక విధంగా అతను గత రెండు సినిమాలతో అగ్ర హీరోల లిస్టులో చేరాడు అని చెప్పవచ్చు. ఎలాంటి సినిమా చేసినా కూడా శివకర్తికేయన్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. ఇక అక్టోబర్ 21న తెలుగు తమిళ్ లో ఒకేసారి విడుదలైన ప్రిన్స్ సినిమా ఫస్ట్ డే ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకోబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

100 కోట్ల మార్కెట్
శివ కార్తికేయన్ తన ప్రతి సినిమాతో కూడా మార్కెట్ ను పెంచుకుంటున్నాడు. అతను ఇంతకుముందు నటించిన డాన్, డాక్టర్ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద వేగంగా 100 కోట్ల కలెక్షన్స్ అందుకొని సంచలనం సృష్టించాయి. ఎంతో కష్టపడి పైకి వచ్చిన శివ కార్తికేయన్ ఇప్పుడు అగ్ర హీరోల్లో ఒకడిగా గుర్తింపును అందుకుంటున్నాడు.

వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్
తమిళంలో ప్రిన్స్ సినిమా 32 కోట్ల వరకు బిజినెస్ చేయగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.50 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక కర్ణాటకలో 2.5 కోట్లు కేరళలో 1.50 కోట్లు రెస్టాఫ్ ఇండియాలో ఒక కోటి వరకు బిజినెస్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ మొత్తంలో కూడా 6.50 కోట్ల వరకు ధర పలికినట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రిన్ సినిమా 50 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తమిళ్ ఆక్యుపెన్సీ
జాతి రత్నాలు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు అనుదీప్ శివకార్తికేయన్ తో తెరపైకి తీసుకువచ్చిన ప్రిన్స్ సినిమా డీసెంట్ బిజినెస్ అయితే చేసింది. తమిళంలో ఈ సినిమాను భారీ స్థాయిలోనే విడుదల చేశారు. ఇక థియేటర్ ఆక్యుపెన్సీ ఏ రేంజ్ లో జరిగింది అనే వివరాల్లోకి వెళితే.. మొదటి రోజు తమిళ భాషలో మొత్తంగా కూడా మధ్యాహ్నం సమయానికి ఈ సినిమా 34 శాతానికి పైగా ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

తెలుగు ఆక్యుపెన్సీ
ఇక తెలుగులో కూడా ఈ సినిమాకు కొన్ని ఏరియాలలో మంచి ఓపెనింగ్స్ అందుకున్నట్లు సమాచారం. మార్నింగ్ షో అయితే 23.51 శాతం, మధ్యాహ్నం దాదాపు 25.53 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదు అయినట్లు తెలుస్తోంది. ఒక విధంగా పూర్తిస్థాయిలో అయితే పెద్దగా హౌస్ ఫుల్ కలెక్షన్లు నమోదు కాలేదని తెలుస్తోంది. జాతి రత్నాలు సినిమాతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న దర్శకుడు ఈసారి పూర్తిస్థాయిలో పెద్దగా మెప్పించలేదని కామెంట్స్ కూడా వస్తున్నాయి.

మొదటి రోజు ఎంత రావచ్చంటే?
ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే లేటెస్ట్ వినిపిస్తున్న లెక్కల ప్రకారం తమిళంలో మంచి కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్ తెలుగు తమిళంలో కలిపి మొదటి రోజు 6 నుంచి 9 కోట్ల మధ్యలో నెట్ కలెక్షన్స్ రావచ్చని సమాచారం. ఇంతకుముందు శివకార్తికేయన్ డాన్ సినిమా మొదటి రోజు 9.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఆ రేంజ్ లో కాకపోయినా 8 కోట్ల గ్రాస్ రావచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











