twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prince Movie 6 Days Collections: 100 కోట్ల హీరోకి ప్రిన్స్ షాక్.. సగం రావడం కూడా డౌటే?

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవాలని శివకార్తికేయన్ కూడా గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అతను నటించిన సినిమాలు కొన్ని తెలుగులో డీసెంట్ కలెక్షన్స్ అందుకున్నాయి. అయితే ఆ సినిమాల విషయంలో అతను తెలుగులో పెద్దగా ప్రమోషన్ చేసింది అయితే లేదు. డాక్టర్, డాన్ రెండు సినిమాలు కూడా తెలుగులో మంచి కలెక్షన్స్ అయితే అందుకున్నాయి. ఆ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అతను 100 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకోవడంతో మంచి డిమాండ్ ఏర్పడింది.

    ఇక తెలుగులో కూడా అతను మంచి గుర్తింపును అందుకోవాలి అని ఈసారి ప్రిన్స్ అనే సినిమాతో వచ్చాడు. తెలుగు దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి విడుదలైంది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్స్ అందుకోలేకపోయింది. ఒక విధంగా జాతి రత్నాలు సినిమాతో అనుదీప్ భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నప్పటికీ కూడా ఈ సినిమా కంటెంట్ పూర్తిస్థాయిలో జనాలకు కనెక్ట్ కాకపోయింది. దీంతో ఆ రేంజ్ లో అయితే కలెక్షన్స్ రాలేకపోయాయి.

    Sivakarthikeyan prince movie 6 days worldwide collections

    ప్రిన్స్ సినిమా తమిళంలో 32 కోట్ల వరకు బిజినెస్ చేయగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.50 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ప్రిన్స్ సినిమా 50 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే మొదటి రెండు రోజుల్లో తమిళంలో కలెక్షన్స్ అయితే బాగానే వచ్చాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ ఒకసారిగా తగ్గిపోయాయి. ఇక తెలుగులో అయితే 6వ రోజు కేవలం 15 లక్షల రేంజ్ లో మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి.

    రోజురోజుకు తెలుగులో కలెక్షన్స్ పూర్తిగా తగ్గిపోతూ వచ్చాయి. ఇక మొత్తంగా ఆరు రోజుల్లో అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రిన్స్ సినిమా 2.64 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఐదు కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఈ సినిమా అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్స్ ప్రకారం చూస్తే సినిమా సక్సెస్ కావాలి అంటే ఇంకా 4.22 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రావాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రిన్స్ సినిమా 6 రోజుల్లో దాదాపు 42 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇక చివరి రెండు సినిమాలతో 100 కోట్ల గ్రాస్ అందుకున్న శివకార్తికేయన్ ఈసారి ప్రిన్స్ తో 50 కోట్ల టార్గెట్ ను కూడా అందుకోకపోవచ్చని తెలుస్తోంది.

    English summary
    Sivakarthikeyan prince movie 6 days worldwide collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X