Prince Movie Pre Release Bussiness: మరో బిగ్ టార్గెట్ తో శివకార్తికేయన్ సినిమా.. ఎంత రావాలంటే?
తమిళంలో ఇటీవల కాలంలో వరుసగా 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న యువ హీరోలలో శివకార్తికేయన్ ఒకరు. అతను బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాకుండా తెలుగులో కూడా మెల్లగా అతని రేంజ్ పెరుగుతొంది. ఇక ఇప్పుడు మొదటిసారి శివకార్తికేయన్ తెలుగు తమిళ భాషలో ఒకేసారి తెరపైకి తీసుకువచ్చిన ప్రిన్స్ అనే సినిమాతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నాడు. శుక్రవారం విడుదల అవుతున్న ఈ సినిమా మొత్తం ఎంత బిజినెస్ చేసింది ఎంత వస్తే సక్సెస్ అయినట్లు లెక్క అనే వివరాల్లోకి వెళితే..\

బాక్సాఫీస్ కాంబినేషన్
జాతి రత్నాలు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రిన్స్ సినిమాపై తెలుగులో అయితే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదివరకే డాక్టర్, డాన్ సినిమాలతో 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుని తన మార్కెట్ను పెంచుకున్నాడు. ఇక ఈ సినిమాకు ఈ కాంబినేషన్ ద్వారానే మంచి డిమాండ్ ఏర్పడింది.

బడ్జెట్ ఎంతంటే?
ప్రిన్స్ సినిమాను రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించాయి. సురేష్ ప్రొడక్షన్ తో పాటు ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ప్రిన్స్ సినిమా భారీ స్థాయిలోనే తెలుగు తమిళంలో ఒకేసారి విడుదలవుతోంది. ఇక ఈ సినిమా కోసం దాదాపు 50 నుంచి 60 కోట్ల మధ్యలో ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరపైకి వచ్చిన ఈ సినిమాలో ఒక మంచి సందేశం కూడా ఉంటుందట.

ప్రిన్స్ తమిళ్ బిజినెస్
ప్రిన్స్ సినిమాకు సంబంధించిన బిజినెస్ ఏ స్థాయిలో జరిగింది అని వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో ప్రిన్స్ సినిమా దాదాపు 30 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. శివ కార్తికేయన్ ప్రతి సినిమా కూడా అక్కడ ఈజీగా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను పూర్తి చేస్తుంది. కాబట్టి ఈ సినిమా కూడా అంతకుమించి అనేలా కలెక్ట్ చేయవచ్చని టాక్ వస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో
ఇక తెలుగులో అయితే ఇదివరకే అనుదీప్ జాతి రత్నాలు సినిమాతో భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్నాడు. కాబట్టి ఈ సినిమాకు కూడా దాదాపుగా రేంజ్ లో ఒక టార్గెట్ అయితే సెట్ అయ్యింది. ప్రిన్స్ సినిమా తెలంగాణ ఆంధ్ర లో 9.50 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఏమాత్రం పాజిటివ్ ఆఫ్ వచ్చిన కూడా సినిమా హై రేంజ్ లో సక్సెస్ అవుతుంది అని చెప్పవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా
ప్రిన్స్ సినిమా మిగతా స్టేట్స్ లో కూడా డీసెంట్ తరహాలోనే బిజినెస్ చేయడం జరిగింది. కర్ణాటకలో ఈ సినిమా 2.50 కోట్ల వరకు ధర పలికినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేరళలో 1.50 కోట్లతో టార్గెట్ తో ఈ సినిమా విడుదల కాబోతోంది. రెస్టాఫ్ ఇండియాలో మాత్రం ఒక 1 కోటికి అమ్ముడైనట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ మొత్తంలో కూడా 6.50 కోట్ల బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రిన్స్ సినిమా శివ కార్తికేయన్ రేంజ్ కు తగ్గట్టుగానే 51 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం.

టార్గెట్ ఎంతంటే?
ఒక విధంగా ఇది పెద్ద టార్గెట్ అని చెప్పవచ్చు. ఇక తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అయితే ఈజీగా పూర్తి చేస్తుంది. మొత్తంగా ప్రిన్సెస్ సినిమా సక్సెస్ కావాలి అంటే ప్రపంచం మొత్తంగా 52 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. మరి శివ కార్తికేయన్ ఆ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











