Sky Force Collections: 140 కోట్ల బడ్జెట్‌తో అక్షయ్ కుమార్.. స్కై ఫోర్స్ కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు జియో స్టూడియోస్, మడోక్ ఫిల్మ్స్, లియో ఫిల్మ్స్ యూకే ప్రొడక్షన్ బ్యానర్లపై జ్యోతి దేశ్‌పాండే, అమర్ కౌశిక్, భౌమిక్ గండాలియా, దినేష్ జైన్ నిర్మించిన చిత్రం స్కై ఫోర్స్. అక్షయ్ కుమార్, వీర్ పహరియా, సారా ఆలీ ఖాన్, నిమ్రత్ కౌర్, శరత్ కేల్కర్ తదితరులు నటించారు. సందీప్ కీవ్‌లానీ, అభిషేక్ అనిల్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 24, 2025 తేదీన రిలీజ్ అయింది. ఈ మూవీ కథ ఏమిటి? బడ్జెట్ ఎంత? ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
1965 సంవత్సరంలో జరిగిన ఇండియా, పాకిస్థాన్ ఎయిర్ వార్ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇండియాపై తొలి ఎయిర్ స్ట్రయిక్ జరిగిన సర్గోదా ఎయిర్‌బేస్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌గా రూపొందించారు. ఈ చిత్రంలో వింగ్ కమాండర్ కుమార్ ఓం అహుజాగా నటించారు. నిమ్రత్ కౌర్ ఆయనకు జోడిగా భార్య పాత్రలో నటించారు. మరో జంటగా వీర్ పహారియా, సారా ఆలీ ఖాన్ నటించారు.

ఇండియన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన ఈ సినిమాను భారీగా ఖర్చుకు వెనుకాడకుండా చిత్రీకరించారు. ఈ చిత్రంలో భారీగా తారాగణం పాల్గొన్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను, సంతాన కృష్ణన్, రవిచంద్రన్ సినిమాటోగ్రఫిని, తనిష్క్ బాగ్చీ, జస్టిస్ వర్గీస్ సంగీతం అందించారు. ఈ సినిమాకు పనిచేసిన యూనిట్ రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపితే సుమారుగా 140 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని పేర్కొంటున్నారు.
రిపబ్లిక్ డే కానుకగా రూపొందిన స్కై ఫోర్స్ సినిమాను భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 4500 స్క్రీన్లను ఇండియాలో, ఓవర్సీస్‌లో 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో గ్రాండ్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే ఇటీవల కాలంలో అక్షయ్ కుమార్ సినిమాలు అంతగా బాక్సాఫీస్ వద్ద రాణించడకపోవడంతో.. ఈ సినిమాపై అందరి దృష్టి పడింది.
అక్షయ్, సారా ఆలీ ఖాన్, నిమ్రత్ కౌర్ నటించిన ఈ సినిమా గ్రాండ్‌గానే ఓపెన్సింగ్స్ సాధించింది. ఈ సినిమా తొలి రోజు ఇండియాలో 11 కోట్ల రూపాయలు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో రోజు ఈ సినిమా సుమారుగా 5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే అక్షయ్ నటించిన ఓ మై గాడ్ 2 (10.5 కోట్లు) సినిమా కంటే అధికంగా, బడె మియా చోటేూ మియా (15 కోట్లు) కంటే తక్కువగా వసూళ్లను సాధించింది.


Click it and Unblock the Notifications











