Sky Force Collections: 100 కోట్ల క్లబ్‌లో స్కై ఫోర్స్.. ఎట్టకేలకు అక్షయ్ కుమార్ ఖాతాలో హిట్!

బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు జియో స్టూడియోస్, మడోక్ ఫిల్మ్స్, లియో ఫిల్మ్స్ యూకే ప్రొడక్షన్ బ్యానర్లపై జ్యోతి దేశ్‌పాండే, అమర్ కౌశిక్, భౌమిక్ గండాలియా, దినేష్ జైన్ నిర్మించిన చిత్రం స్కై ఫోర్స్. అక్షయ్ కుమార్, వీర్ పహరియా, సారా ఆలీ ఖాన్, నిమ్రత్ కౌర్, శరత్ కేల్కర్ తదితరులు నటించారు. సందీప్ కీవ్‌లానీ, అభిషేక్ అనిల్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 24, 2025 తేదీన రిలీజ్ అయింది. ఈ మూవీ కథ ఏమిటి? బడ్జెట్ ఎంత? ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

స్కై ఫోర్స్ సినిమా కథ విషయానికి వస్తే.. 1965 సంవత్సరంలో జరిగిన ఇండియా, పాకిస్థాన్ ఎయిర్ వార్ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇండియాపై తొలి ఎయిర్ స్ట్రయిక్ జరిగిన సర్గోదా ఎయిర్‌బేస్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌గా రూపొందించారు. ఈ చిత్రంలో వింగ్ కమాండర్ కుమార్ ఓం అహుజాగా నటించారు. నిమ్రత్ కౌర్ ఆయనకు జోడిగా భార్య పాత్రలో నటించారు. మరో జంటగా వీర్ పహారియా, సారా ఆలీ ఖాన్ నటించారు.

Sky Force day 5 Box Office Collections Worldwide Akshay Kumar s Movie in 100 Crores Club

అక్షయ్ కుమార్ ఇమేజ్‌కు అగ్ని పరీక్షగా నిలిచిన ఈ సినిమాకు పనిచేసిన యూనిట్ రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపితే సుమారుగా 140 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని పేర్కొంటున్నారు. రిపబ్లిక్ డే కానుకగా రూపొందిన స్కై ఫోర్స్ సినిమాను భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 4500 స్క్రీన్లను ఇండియాలో, ఓవర్సీస్‌లో 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో గ్రాండ్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

రిపబ్లిక్ డే కానుకగా రిలీజైన దేశభక్తి ప్రధానంగా రూపొందిన స్కై ఫోర్స్ సినిమా ఘనంగా ఓపెనింగ్స్ సాధించింది. ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో 12.5 కోట్ల రూపాయలు నికరంగా రాబట్టింది. రెండో రోజున శనివారం 22 కోట్లు, 3వ రోజు 28 కోట్ల రూపాయలు వసూలు చేసి 100 కోట్ల కలెక్షన్లపై కన్నేసింది. ఇక సోమవారం అన్ని సినిమాలు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నది. ఈ సినిమా 4వ రోజున 7 కోట్లు నికరంగా రాబట్టింది.

Sky Force day 5 Box Office Collections Worldwide Akshay Kumar s Movie in 100 Crores Club

ఇక ఈ సినిమా 5వ రోజున కూడా బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురి అయినట్టు కనిపించింది. కానీ వర్కింగ్ డే రోజున మంచి కలెక్షన్లే రాబట్టింది. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమాకు సుమారుగా 35 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. దాంతో ఈ చిత్రం 5వ రోజున సుమారుగా 5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో ఈ సినిమా నిలకడగా కలెక్షన్లు రాబడుతుందని వెల్లడించారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా స్కై ఫోర్స్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియాలో 83 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం 7.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 90.5 కోట్లు రాబట్టింది. ఇక 5వ రోజు కలెక్షన్లతో కలిపి ఈ చిత్రం 100 కోట్లకు చేరువగా అయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇటీవల కాలంలో అక్షయ్ కుమార్ సినిమాలు వరుస డిజాస్టర్లు కావడంతో ఈ సినిమాపైనే పెట్టుకొన్న ఆయన నమ్మకం వర్కవుట్ అయిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X