రాజమౌళి ‘ఈగ’ శాటిలైట్ రైట్స్ అన్ని కోట్లా..?
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఈగ" సినిమా ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఇప్పటికే పూర్తయి పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. భారీ సాంకేతిక పరిజ్ఞానం, ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తూ రూపొందుతున్న ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌ను ఓ ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ మీడియా సంస్థ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం సదరు సంస్థ ఇందుకోసం రూ. 5.5 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియవస్తోంది.
ఈ చిత్రం భారత దేశ సీని చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన గ్రాఫిక్స్ తో రూపొందిస్తున్నారని, చిత్రీకరణ కోసం హాలీవుడ్ రేంజ్ టెలిస్కోపిక్ కెమెరాలు వాడుతున్నారని చర్చించుకుంటున్నారు. ఈ సినిమా ఆడియోను మార్చి 22న విడదుల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాని, సమంత, సుదీప్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రఫీ కె.కె.సెంథిని, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత: సాయి కొర్రపాటి, దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి


Click it and Unblock the Notifications











