Solo Boy Collections: సోలో బాయ్ హిట్టా? ఫట్టా? గౌతమ్ కృష్ణ మూవీకి కలెక్షన్లు ఎంతంటే?
సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటించిన చిత్రం సోలో బాయ్. ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, భద్రం, షఫీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. త్రిలోక్ సుద్దు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా చేయగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతల్ని నిర్వహించారు. జులై 4వ తేదీన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద సాధించిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
ప్రేమికురాలిత లవ్, బ్రేకప్, పెళ్లి చేసుకొన్న భార్యతో డైవోర్స్ లాంటి పరిస్తితులు మధ్య తరగతికి చెందిన యువకుడు కృష్ణమూర్తి (గౌతమ్ కృష్ణ)కు ఎదురవుతాయి. తన జీవితానికి పరీక్షగా మారిన ప్రతికూల పరిస్థితులను ఎదురించి కృష్ణమూర్తి తన లైఫ్‌ను ఎలా మలుచుకొన్నాడు? రైతుల కోసం ఎలాంటి టెక్నాలజీ ఇన్నోవేషన్ చేశాడు. మధ్య తరగతి జీవితాన్ని అధిగమించి.. ఎలా రిచ్ మ్యాన్‌గా మారాడు. సోలో బాయ్‌గా లైఫ్‌ను ఎలా సాగించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే సోలో బాయ్ సినిమా కథ.

గౌతమ్ కృష్ణ లాంటి యువ హీరోపై వినూత్నమైన కంటెంట్‌ను డిజైన్ చేసిన చిత్రమిది. కంటెంట్ డిమాండ్ చేయడంతో ఖర్చు విషయంలో రాజీ పడకుండా క్వాలిటీగా ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ మూవీలో నటించిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యురేనరేషన్లతో ఈ సినిమాను సుమారుగా 8 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ వాల్యూను 4 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 4 కోట్ల రూపాయల షేర్, 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.
సోలో బాయ్ సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత క్రిటిక్స్, సాధారణ ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రివ్యూస్ సొంతం చేసుకొన్నది. చిన్న చిత్రాల్లో మంచి కంటెంట్, క్వాలిటీతో సినిమా తీశారనే టాక్ వినిపించింది. ఈ సినిమా పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ గురించి నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్‌పై చిత్ర యూనిట్ హ్యాపీగా ఉందని వెల్లడించారు.
ఇక సోలో బాయ్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ మూవీ తొలి రోజున 25 లక్షలు నెట్ 50 లక్షల గ్రాస్, రెండో రోజున 20 లక్షల నెట్, 40 లక్షల గ్రాస్, మూడో రోజు ఈ సినిమా 30 లక్షల నెట్, 60 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా గత మూడు రోజుల్లో 75 లక్షల నెట్, 1.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని పేర్కొన్నారు.
గౌతమ్ కృష్ణ, సెవెన్ హిల్స్ సతీష్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా సోమవారం నుంచి నిలకడగా వసూళ్లు సాధిస్తే.. కలెక్షన్లు పుంజుకొంటాయి. ఒకవేళ పరిస్థితి లేకపోతే బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇక ఈ సినిమా రానున్న రోజుల్లో ఏ మేరకు కలెక్షన్లు సాధిస్తుందనే విషయాన్ని వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











