సోలో బ్రతుకే సో బెటర్ బాక్సాఫీస్ రిపోర్టు: తొలి రోజునే సాయిధరమ్ తేజ్ మూవీకి రికార్డు కలెక్షన్లు

కరోనావైరస్ లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన తొలి చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. లాక్‌డౌన్ నిబంధనల మధ్య విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబడుతున్నట్టు సమాచారం. నభ నటేష్‌తో కలిసి నటించిన ఈ చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహించారు. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలాంటి కలెక్షన్లను సాధిస్తున్నదంటే..

 మెగా మేనల్లుడికి భారీ కలెక్షన్లు

మెగా మేనల్లుడికి భారీ కలెక్షన్లు

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ సొంతం చేసుకోవడంతో నిర్మాతలు, డిస్టిబ్యూటర్లలో సినిమాపై ఆశలు చిగురించాయి. లాక్‌డౌన్ తర్వాత ప్రేక్షకుల వస్తారా అనే అనుమానాలను పటాపంచలు చేశాయి.

తొలి రెండు ఆటలకే రూ. కోటికి చేరువగా

తొలి రెండు ఆటలకే రూ. కోటికి చేరువగా

లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత పలు ప్రాంతాల్లో సినిమా థియేటర్లలో మూవీస్‌ను రిలీజ్ చేశారు. అయితే ఆ చిత్రాలకు పెద్దగా ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. పలు చిత్రాలు అత్తెసరు కలెక్షన్లతో సరిపెట్టుకొన్నాయి. ఈ క్రమంలో సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని రిలీజ్ చేయగా మంచి స్పందనను కూడా గట్టుకొంటున్నది. తొలి రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.91.37 లక్షల రూపాయల వసూళ్లను నమోదు చేసింది. లాక్‌డౌన్ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఇదే అత్యుత్తమ రికార్డులని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

 నైజాం, సీడెడ్‌లో కలెక్షన్లు

నైజాం, సీడెడ్‌లో కలెక్షన్లు

సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం నైజాంలో భారీగా కలెక్షన్లను రాబడుతున్నట్టు సమాచారం. ఈ చిత్రం తొలి రోజున రెండు ఆటలకే రూ.30.75 లక్షల రూపాయలను సొంతం చేసుకొన్నట్టు సినీ వర్గాలు వెల్లడించాయి. ఇక సీడెడ్‌లో కూడా ఈ చిత్రం 17.74 లక్షల రూపాయలను రాబట్టడం విశేషంగా పేర్కొంటున్నారు.

Recommended Video

Solo Brathuke So Better Team Interview | Sai Dharam Tej Laughs At Vennela Kishore Punches
ఆంధ్రాలో వసూళ్లు ఇలా..

ఆంధ్రాలో వసూళ్లు ఇలా..

ఇక ఆంధ్రా ప్రాంతంలో సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం కలెక్షన్లు సానుకూలంగా స్పందనను వ్యక్తం చేశాయి. వైజాగ్‌లో ఈ చిత్రం రూ.11.5 లక్షలు, గుంటూరులో రూ. 8.06 లక్షలు, కృష్ణా జిల్ాలో రూ.5.11 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 7.04 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6.14 లక్షలు, నెల్లూరులో రూ.5.03 లక్షలు, సీడెడ్‌లో రూ.17.74 లక్షల వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X