Box office: సోలో బ్రతుకే సో బెటర్ పనైపోయింది.. మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత బాక్సాఫీస్ హవా మొదలైంది. ఒక సినిమా తరువాత మరొకటి పవర్ఫుల్ కలెక్షన్స్ అందుకోవడంతో మిగతా సినిమాలకు కూడా ధైర్యం వచ్చింది. కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తరువాత ప్రేక్షకులకు ముందుకు వచ్చిన మొదటి పెద్ద సినిమా సోలో బ్రతుకే సో బెటర్. సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమా మిక్సీడ్ టాక్ ను అందుకుంది. ఇక సంక్రాంతికి సినిమాల హడావుడి ఎక్కువవ్వడంతో ఆల్ మోస్ట్ సినిమా థియేటర్స్ నుంచి బయటకు రానుంది. ఇక క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే..

సాలీడ్ ఓపెనింగ్స్..

సాలీడ్ ఓపెనింగ్స్..

సాయి ధరమ్ తేజ్ 2019 చివరలో ప్రతిరోజూ పండగే సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని 2020లో కూడా క్రిస్టమస్ టైమ్ లోనే వచ్చాడు. సోలో బ్రతుకే సో బెటర్ అని రొమాంటిక్ ఎంటర్టైనర్ ను విడుదల చేయగా సినిమాకు సాలీడ్ ఓపెనింగ్స్ దక్కాయి. ఇండస్ట్రీ మొత్తం ఆ సినిమాకు సపోర్ట్ చేయడంతో కలెక్షన్స్ బాగానే వచ్చాయి.

యావరేజ్ టాక్ ను అందుకున్నప్పటికి..

యావరేజ్ టాక్ ను అందుకున్నప్పటికి..

ఇక మొత్తానికి సోలో బ్రతుకు సో బెటర్ యావరేజ్ టాక్ ను అందుకున్నప్పటికి కలెక్షన్స్ విషయంలో మాత్రం సంతృప్తిని ఇచ్చింది. జనాలు మళ్ళీ థియేటర్స్ కు వస్తున్నట్లు ఇండస్ట్రీకి ఒక ధైర్యాన్ని కూడా ఇచ్చింది. ఇక సంక్రాంతి సినిమాల థియేటర్స్ ను లాగేసుకోవడంతో ఈ సినిమా క్లోజింగ్ కు వచ్చేసింది.

మొత్తం షేర్స్ ఎంతంటే..

మొత్తం షేర్స్ ఎంతంటే..

సినిమా ఎంతవరకు లాభల్లోకి వెళ్లిందని విషయంలోకి వెళితే.. పెట్టిన పెట్టుబడికి మాత్రం మంచి ప్రాఫిట్స్ ను అందించింది. ఒక విధంగా 50% లిమిటేషన్ తోనే థియేటర్స్ నడుస్తున్నప్పటికి ఏ మాత్రం నష్టాలకు గురి చేయలేదు. సోలో బ్రతుకే సో బెటర్ తన పని అయిపోయే సరికి మొత్తం రూ.21.25కోట్ల షేర్స్ ను అందించినట్లు తెలుస్తోంది.

Recommended Video

Solo Bratuke So Better First Day Collections | ఇండస్ట్రీకి జోష్ పెంచిన సాయితేజ్ మూవీ
 ప్రాఫిట్స్ ఎంతంటే..

ప్రాఫిట్స్ ఎంతంటే..

ఇక అసలు వివరాల్లోకి వెళితే.. సినిమా బిజినెస్ 9.2కోట్లు కాగా అంతకంటే ఎక్కువగానే షేర్స్ ను అందుకుంది. ఎపి తెలంగాణలో మొత్తం 11.68కోట్ల షేర్స్ రాగా.. వరల్డ్ వైడ్ గా 12.61కోట్లు వచ్చాయి. ఇక సినిమాకు వచ్చిన ప్రాఫిట్ 3.01కోట్లు. పెట్టినపెట్టుబడికి లాభం కాబట్టి సోలో బ్రతుకే సో బెయిర్ సూపర్ హిట్ గా నిలిచింది. మరి సంక్రాంతి సినిమాలు ఏ స్థాయిలో ప్రాఫిట్స్ అందుకుంటాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X