'సోలో' చిత్రం శాటిలైట్ రైట్స్ రేటెంత?
నారా రోహిత్ తాజా చిత్రం సోలో చిత్రం రెండు వారాల క్రితం విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని మా టీవీ వారు తీసుకున్నట్లు సమాచారం. ఇందు నిమిత్తం కోటి డబ్బై ఐదు లక్షలు చెల్లించినట్లు చెప్తున్నారు. ఈ చిత్రం ఫ్యామిలీ చిత్రంగా ప్రమోట్ చేయటం బాగా కలిసివచ్చింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్,జయసుధ వంటి స్టార్స్ ఉండటం,బొమ్మరిల్లు చిత్రంతో పోల్చటం ఈ చిత్రంకు ప్లస్సైన మరో అంశం. దాంతో టీవిలో వేస్తే మంచి రేటింగ్ లు వస్తాయని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో డైలాగులుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కూడా మంచి మార్కులే కొట్టేసింది.
ఇక లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని పరుశరామ్ రూపొందించారు. ఆయన గతంలో యువత,ఆంజనేయులు చిత్రాలు నిర్మించారు. ఆంజనేయులు చిత్రం ధియోటర్లో ఫ్లాప్ అయినా టీవీల్లో మంచి రేటింగ్స్ ని సంపాదించి శాటిలైట్ రైట్స్ కొనుక్కున్న వారికి బాగా డబ్బులు తెచ్చిపెట్టడంతో ఈ చిత్రానికి మంచి రేటుని మా టీవీ వారు ఫిక్స్ చేసి తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక నారా రోహిత్ కూడా బయిట మంచి ఆఫర్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











