Son of Sardar 2 Collections: 150 కోట్ల బడ్జెట్‌తో సన్నాఫ్ సర్దార్ 2.. డిజాస్టర్ టాక్‌తో మృణాల్ మూవీకి ఎన్ని కో
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నిర్మాతగా మారి నటించిన చిత్రం సన్నాఫ్ సర్దార్ 2 (Son of Sardaar 2). విజయ్ కుమార్ అరోరా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, రవి కిషన్, నీరూ బజ్వా, చంకీ పాండే, శరత్ సక్సేనా, ముకుల్ దేవ్, వీందూ దారా సింగ్ తదితరులు నటించారు. ఈ సినిమాను అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, ఎన్ఆర్ పచిసియా, ప్రవీణ్ తల్రేజా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేస్తున్న వసూళ్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
దేవగన్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు అసీమ్ బజాజ్ సినిమాటోగ్రఫి, నినద్ ఖనోల్కర్ ఎడిటింగ్ అందించారు. ఈ సినిమాకు జానీ, తనిష్క్ బాగ్చీ తదితరులు మ్యూజిక్ అందించారు. అమర్ మోహిలే, సలీల్ అమ్రుతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. భారీ తారాగణం, టాలెంటెడ్ టెక్నిషియన్స్ మేళవింపుతో ఈ సినిమాను 150 కోట్ల రూపాయల బడ్జెట్‌త నిర్మించడం జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

సన్నాఫ్ సర్దార్ సినిమా హిందీ ప్రేక్షకుల్లో భారీ ఆదరణ ఉండటం, ఆ మూవీకి సీక్వెల్‌గా, ప్రాంచైజీగా రూపొందడంతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను ఇండియాలో సుమారుగా 2500 స్క్రీన్లలో , వరల్డ్ వైడ్‌గా 3000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ ద్వారా భారీగానే రిటర్న్స్ రాబట్టింది. ఈ క్రమంలో థియేట్రికల్‌గా ఈ సినిమా కనీసం 100 కోట్ల టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
సన్నాఫ్ సర్దార్ 2 సినిమా ప్రమోషన్స్ భారీగా చేయడంతో రిలీజ్‌కు ముందు మంచి బజ్ ఏర్పడింది. దాంతో తొలి వారాంతం ఓపెనింగ్స్ కూడా అత్యధికంగా లభించాయి. కానీ రిలీజ్ తర్వాత టాక్ కంప్లీట్‌గా నెగిటివ్‌గా ఉండటంతో కలెక్షన్లు భారీగా క్షీణించాయి. ఆ తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోలుకోలేని పరిస్థితి కనిపించింది.
అజయ్ దేవగన్, మృణాల్ నటించిన ఈ సినిమా తొలి రోజు 7.5 కోట్ల రూపాయల వసూలు చేసింది. రెండో రోజు 8 కోట్లు, మూడో రోజు 9.25 కోట్ల రూపాయలు రాబట్టింది. మూడు రోజుల్లో 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నాలుగో రోజు 2.25 కోట్ల రూపాయలు, 5వ రోజు 2.5 కోట్ల రూపాయలు, 6వ రోజు 1.7 కోట్లు కలెక్షన్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 32 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే ప్రస్తుతం తొలివారంలో ఈ సినిమా చేస్తున్న వసూళ్లను చూస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే భారీగా కలెక్షన్లు రాబట్టాల్సిందనిపిస్తుంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం ఇంకా 60 నుంచి 70 కోట్ల మధ్య వసూళ్లను నమోదు చేయాల్సి ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సినిమా రెండోవారంలో పుంజుకొని లాభాలకు చేరువ అవతుుందా? అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications










