»   » ‘S/O సత్యమూర్తి’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

‘S/O సత్యమూర్తి’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సన్నాఫ్ సత్యమూర్తి ' చిత్రం ఊహించిన స్థాయిలో విజయం సాధించలేదనే చెప్పొచ్చు. సినిమా కేవలం ‘ఎ' సెంటర్లలో మాత్రమే పూర్తి స్థాయి కలెక్షన్లతో రన్ అవుతోంది. బి, సి గ్రేడ్ సెంటర్లలో ఈ సినిమా కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉంది.

తాజాగా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటి వరకు కలెక్షన్లు కాస్త సంతృప్తి కరంగానే ఉన్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఫస్ట్ వీక్ హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్ల సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే గత టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టడంలో మాత్రం విఫలం అయింది.


తొలి వారంలో ఆంధ్రా, తెలంగాణ బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం రూ. 26.24 కోట్ల షేర్ సాధించింది. ఉపేంద్ర నటించడంతో కర్నాటకలో కూడా వసూళ్లు బానే ఉన్నాయి. తొలివారం ఇక్కడ ఈ చిత్రం రూ. 3.90 కోట్లు రాబట్టింది. ఇతర రాష్ట్రాలన్నింటిలో కలిపి రూ. 1.20 కోట్ల షేర్ సాధించింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో తొలి వారం రూ. 5.6 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు టోటల్ వరల్డ్ వైడ్ రూ. 36.94 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.


నైజాం
  

నైజాం

నైజాం ఏరియాలో ఈచిత్రం రూ. 10.80 కోట్లు వసూలు చేసింది. బన్నీ కెరీర్లో ఇక్కడ ఇదే హయ్యెస్ట్


సీడెడ్
  

సీడెడ్

సీడెడ్ ఏరియాలో ఈ చిత్రం రూ. 4.51 కోట్లు వసూలు చేసింది.


కృష్ణా
  

కృష్ణా

తొలివారంలో ఈ చిత్రం ఈ ఏరియాలో రూ. 1.83 వసూలు చేసింది.


గుంటూరు
  

గుంటూరు

గుంటూరు ఏరియాలో ఈ చిత్రం తొలి వారం రూ. 2.43 కోట్లు వసూలు చేసింది.


నెల్లూరు
  

నెల్లూరు

నెల్లూరు ఏరియాలో ఈ చిత్రం రూ. 96 లక్షలు మొదటివారంలో వసూలు చేసింది.


వెస్ట్ గోదావరి
  

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ చిత్రం తొలి వారం రూ. 1.72 కోట్లు వసూలు చేసింది.


ఈస్ట్ గోదావరి
  

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ చిత్రం తొలి వారం రూ. 1.99 కోట్లు వసూలు చేసింది.


ఉత్తరాంధ్ర
  

ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర ఏరియాలో ఈ చిత్రం తొలి వారం రూ. 2.72 కోట్లు వసూలు చేసింది.


 


 


Please Wait while comments are loading...