పవన్ కళ్యాణ్ 'కొమరం పులి' చిత్రం ఆడియో ఎంత పలికిందంటే..

By Srikanya

పవన్ కళ్యాణ్ 'కొమరం పులి' చిత్రం ఆడియో ని సోనీ మ్యూజిక్ వారు రెండు కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో ఈ రేంజిలో ఏ చిత్రం ఆడియోకు ఈ రేటు పలకలేదని చెప్తున్నారు. ఈ క్రేజ్ రావటానకి ఆస్కార్ విజేత ఎ.ఆర్ రహమాన్ సంగీతం అందించటం కొంత ప్లస్ అయితే పవన్ కళ్యాణ్ కి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ కారణం అంటున్నారు. ఇక ఈ చిత్రం ఆడియో జులై 11ఉదయం నొవోటెల్ హోటల్ లో జరగనుంది.ని సమాచారం. ఎఆర్ రహమాన్ కి వేరే బిజీ షెడ్యూల్ ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. మొదట డైరక్ట్ గా మార్కెట్లోకి రిలీజ్ చేద్దామనుకున్నా సినిమాకు క్రేజ్ తేవాలనే ఉద్దేశ్శంతో మళ్ళీ ఆడియో పంక్షన్ చేయటానికి ప్రిపేర్ అవుతున్నారని వినపడుతోంది. అందుకు తగినట్లే శిల్ప కళా వేదికలో ఈ చిత్రం ఆడియోను సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా విడుదల చేసి, క్రేజ్ తీసుకురానున్నారు. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రైట్స్ ని సోనీ మ్యూజిక్ వారు భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకున్నారు.అలాగే ఈ 'కొమరం పులి' చిత్రం ఆగస్టు 12న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ వారు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. శింగనల రమేష్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.జె.సూర్య సూర్య దర్శకత్వంలో రూపొందించారు. అలాగే పవన్ సరసన ఈ చిత్రంలో నిఖిషా పటేల్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X