twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పులి' ద గ్రేట్

    By Staff
    |

    Pawan Kalyan
    పవన్ కళ్యాణ్ ట్రేడ్ లో తన సత్తా మరో సారి నిరూపించుకున్నాడు. తాజాగా నిర్మాణమవుతున్న పులి ఆడియో రైట్స్ ఎవరూ ఊహించని రీతిలో రెండున్నర కోట్ల ఆఫర్ ని సంపాదించింది. సోనీ బిఎమ్ జి వారు పోటీకి నిలబడి ఈ క్రేజీ రేట్ తో ఆడియా రైట్స్ ని చేసుకున్నారని సమాచారం. జల్సా చిత్రం ఆడియాని తీసుకున్న ఆదిత్యా మ్యూజిక్ కంపెనీ వారికి దాదాపు కోటిన్నర సంపాదించిపెట్టింది.దాంతో ఈ చిత్రానికి ఆ రేంజి క్రేజ్ ఏర్పడింది.

    అందులోనూ పవన్ కళ్యాణ్,ఎస్.జె.సూర్య గత చిత్రం ఖుషి ఆడియా కూడా అప్పట్లో సంచలనమై నిలిచి రికార్డులు సృష్టించింది. వీటిన్నటికి తోడు ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించటం. మరో ప్రక్క పైరసీ తో ఆడియా మార్కెట్ పూర్తి నిరాశలో ఉన్న ఈ సమయంలో ఇంత రేటు రావటానికి కారణం రింగ్ టోన్ల ద్వారా వచ్చే ఆదాయం అని తెలుస్తోంది. ఏదైనా పవన్ ఏ తెలుగు సినిమాకి లేని రేంజిలో ఆడియా హక్కులు అమ్మటం సంచలనం అయి నిలుస్తోంది. కంగ్రాట్స్ పులి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X