For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SonyLIVలో మొట్ట మొదటి తెలుగు సినిమాగా 'వివాహ భోజనంబు'.. పీనాసి కధతో ప్రేక్షకుల ముందుకు!

  |

  సోనీ లైవ్ సంస్థ తన మొదటి తెలుగు సినిమా వివాహ భోజనంబుతో వినోదానికి కొత్త రుచిని జోడించడానికి సిద్దమయింది. జీ5, ఆహా, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఇలా చాలా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఇప్పుడు తెలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉండగా ఇప్పుడు సోనీ లైవ్ ఓటీటీ సైతం ఈ జాబితాలో చేరబోతోంది. ఇటీవల ప్రముఖ నిర్మాత, 'మధుర ఆడియోస్' అధినేత శ్రీధర్ రెడ్డి... దీనికి టాలీవుడ్ కంటెంట్ హెడ్ గా నియమితులయ్యారు అనే సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఈ 'వివాహ భోజనంబు'తో సోనీ లైవ్ తెలుగు ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టేలా ప్లాన్ చేశారు. హీరో సందీప్ కిషన్ నిర్మించిన 'వివాహ భోజనంబు' మూవీతో కమెడియన్ సత్య హీరోగా పరిచయం అవుతున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో 'నెల్లూరు ప్రభ' అనే పాత్రలో సందీప్ కిషన్ కూడా కనిపిస్తాడు.

  అర్జావీ రాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని లాక్ డౌన్ లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. యదార్థ సంఘటనల స్ఫూర్తితో రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన వివాహ భోజనంబు సోనీలైవ్‌లో ఆగస్టు 27 న ప్రారంభం కానుంది. ఈ సినిమా మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహేష్ మరియు ధనిక ఉమ్మడి కుటుంబానికి చెందిన రమ్య మధ్య ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. ఈ కరోనా మహమ్మారి పరిస్థితి సద్వినియోగం చేసుకున్న మహేష్, ఇరు కుటుంబాల దగ్గరి బంధువుల సమక్షంలో వివాహం చేసుకోవాలని ఒప్పించాడు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ చేయడం వల్ల ఖర్చుతో కూడుకున్న వివాహం తేలిగ్గా అవగొట్టడం కోసం అతను చేసిన ప్రయత్నాల క్రమంలో ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద ఆసక్తి పెంచింది.

  SonyLIV’s first Telugu film ‘Vivaha Bhojanambu’ to start streaming on 27th August

  మోదీ దేశంలో సంపూర్ణ లాక్ డౌన్ పెడుతున్నట్లు ప్రకటించడంతో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించింది. కరోనా టైంలో పెళ్లి చేసుకున్న పిసినారి సత్య.. అదే సమయంలో లాక్ డౌన్ పెట్టడంతో 21 రోజుల పాటు ఇంటికి వచ్చిన బంధువులను పోషించడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు ? వాళ్ళని బయటకు పంపించడానికి ఏమేమి ప్లాన్స్ వేశాడు ? అనేది ఫన్నీగా చూపించారు. ఇంట్లో వారందరికీ కరోనా టెస్టులు చేయించడం.. అంబులెన్స్ లో వారందరిని తమ ఊరికి తరలించాలని చూడటం ఆసక్తికరంగా సాగాయి. ఇక సినిమాను సందీప్ కిషన్ నిర్మించారు, కె. ఎస్. సినీష్ ప్రొడక్షన్ హౌస్‌తో పాటు అతిధి పాత్రలో కూడా కనిపించనున్నారు. సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, ఆనంది ఆర్ట్స్ బ్యానర్ ల మీద ఈ సినిమాని అందించారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. అనివీ సంగీతం అందించిన ఈ సినిమాలో సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, TNR, వైవా హర్ష వంటి ప్రముఖ నటులు కూడా నటించారు. ఈ సినిమా తెలుగుతో పాటు మలయాళం, తమిళం మరియు కన్నడలో కూడా అందుబాటులో ఉంటుంది.

  English summary
  SonyLIV’s first Telugu film ‘Vivaha Bhojanambu’ to start streaming on 27th August.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X