twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2018 బాక్సాఫీస్ రిపోర్ట్: వసూళ్లలో టాప్ సినిమాలు ఇవే, టాలీవుడ్ ఆధిపత్యం!

    |

    2018 సంవత్సరం చివరన రిలీజైనా వసూళ్ల పరంగా ఈ ఏడాది విడుదలైన అన్ని సౌత్ సినిమాను దాటేసింది రజనీకాంత్ 2.0. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్నే అందుకుందని చెప్పక తప్పదు. అయితే టాప్ 20 సినిమా లిస్ట్ తీసుకుంటే అందులో మన తెలుగు సినిమాలే ఎక్కువగా ఉండటం గమనార్హం. మరి ఈ సంవత్సరం సౌత్‌లో వచ్చిన టాప్ సినిమాలే ఏమిటి? ఎంత బడ్జెట్‌తో రూపొందాయి? ఎంత వసూలు చేశాయి అనే విషయాలై ఓ లుక్కేద్దాం.

    2.0 మూవీ

    2.0 మూవీ

    రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘2.0'. రూ. 540 కోట్ల బడ్జెట్‌తో రూపొందింసాకగ. ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 710 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో పాటు ఇంకా బాక్సాఫీసు వద్ద వసూల్లు సాధిస్తూ రన్ అవుతోంది.

    సర్కార్

    సర్కార్

    విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్కార్'. రూ. 115 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 257 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రూ. 139 కోట్ల షేర్ వసూలు చేసింది.

    రంగస్థలం

    రంగస్థలం

    రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగస్థలం'. రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 215.7 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇందులో రూ. 125.2 కోట్ల షేర్ వసూలు చేసింది.

    భరత్ అనే నేను

    భరత్ అనే నేను

    మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘భరత్ అనే నేను' చిత్రాన్ని దాదాపు రూ. 70 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 210 కోట్ల గ్రాస్ వసూలు చేయగా అందులో రూ. 105 కోట్ల షేర్ వసూలైంది.

    కాలా

    కాలా

    రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాలా'. రూ. 135 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 168 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. రూ. 85 కోట్లకు మించి షేర్ వసూలు కాలేదని ట్రేడ్ వర్గాల సమాచారం.

    అరవింద్ సమేత

    అరవింద్ సమేత

    ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ'. రూ. 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 155 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో రూ. 90.7 కోట్ల షేర్ వసూలు చేసింది.

     గీత గోవిందం

    గీత గోవిందం

    విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గీత గోవిందం'. కేవలం రూ. 12 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 126 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇందులో రూ. 70.1 కోట్ల షేర్ రావడం విశేషం. ఈ ఏడాది సౌత్‌లో అత్యధిక లాభాల శాతం సాధించిన చిత్రం ఇదే.

    గ్యాంగ్

    గ్యాంగ్

    సూర్య హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గ్యాంగ్'. రూ. 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రపంచ వ్యాప్తంగా రూ. 95 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇందులో రూ. 48.4 కోట్ల షేర్ వసూలైంది.

    అజ్ఞాతవాసి

    అజ్ఞాతవాసి

    పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అజ్ఞాతవాసి'. దాదాపు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 93 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఇందులో రూ. 57.5 కోట్లకు మించి షేర్ వసూలు కాక పోవడంతో భారీ నస్టాలు తప్పలేదు.

    నా పేరు సూర్య

    నా పేరు సూర్య

    అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా'. రూ. 65 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ. 92 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇందులో రూ. 53.8 కోట్ల షేర్ మాత్రమే వసూలైంది. దీంతో ఈ చిత్రం ప్లాప్ ఖాతాలో పడిపోయింది.

    నవాబ్

    నవాబ్

    అరవిందస్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో మణిరత్నం రూపొందించిన చిత్రం ‘నవాబ్'. రూ. 35 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 92.5 కోట్లు రాబట్టింది. ఇందులో రూ. 47.9 కోట్ల షేర్ వసూలైంది.

    మహానటి

    మహానటి

    ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మహానటి'. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 85.1 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇందుల రూ. 46.4 కోట్ల షేర్ వసూలవ్వడంతో మంచి లాభాలు సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

     చినబాబు

    చినబాబు

    కార్తి హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘చినబాబు'. రూ. 25 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో రూ. 37 కోట్ల మేర షేర్ వసూలు కావడం విశేషం.

    భాగమతి

    భాగమతి

    అనుష్క నటించిన ‘భాగమతి' చిత్రాన్ని రూ. 30 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 66.8 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.... రూ. 35.3 కోట్ల షేర్ వసూలు చేసింది.

    కాయంకుళం కొచ్చుణ్ణి

    కాయంకుళం కొచ్చుణ్ణి

    నవీన్ పాలీ, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో రోషన్ ఆండ్రూ దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘కాయంకుళం కొచ్చుణ్ణి'. రూ. 45 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 66 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇందులో రూ. 32.8 కోట్ల షేర్ వసూలైంది.

     ఇరుంబు తిరై

    ఇరుంబు తిరై

    విశాల్ హీరోగా పిఎస్.మిత్రన్ దర్శకత్వంలో తెరెక్కిన తమిళ చిత్రం ‘ఇరుంబు తిరై'. రూ. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ వల్డ్ వైడ్ రూ. 62.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో రూ. 32.2 కోట్ల షేర్ వసూలైంది.

     వడ చెన్నై

    వడ చెన్నై

    ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వడ చెన్నై'. రూ. 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 62.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇందులో రూ. 32.5 కోట్ల షేర్ వసూలైంది.

     సీమరాజా

    సీమరాజా

    శివకార్తికేయన్ హీరోగా పోన్‌రామ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘సీమరాజా'. ప్రపంచ వ్యాప్తంగా రూ. 57 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ రూ. 29.8 కోట్ల షేర్ వసూలు చేసింది.

    ‘96’ మూవీ

    ‘96’ మూవీ

    త్రిష, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘96'. రూ. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 55.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇందులో రూ. 28.6 కోట్ల షేర్ వసూలైంది.

     సామి స్కేర్

    సామి స్కేర్

    విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సామి స్కేర్'. రూ. 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 52 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇందులో 27.8 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు కావడంతో భారీ నష్టం తప్పలేదు.

    English summary
    South Films 2018 Box Office Report. The detailed box office report of the notable South Indian films released in 2018. The films are listed on the basis of worldwide gross.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X