Spider Verse 4 days collections స్పైడర్ మ్యాన్ కలెక్షన్ల జైత్ర యాత్ర.. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల వసూళ్ల
స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్నది. భారత్‌లోనే కాకుండా అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, యూకే, తదితర దేశాల్లో భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నది. ఈ చిత్రం ఇండియాలో ఏ భాషలో ఎంత వసూలు చేసింది? ప్రపంచవ్యాప్తంగా నమోదు చేసిన రికార్డుల వివరాల్లోకి వెళితే...
స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను 100 మిలియన్ డాలర్లతో అంటే భారతీయ కరెన్సీలో సుమారు 8250 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఇక ఈ సినిమాను ఇండియాలో 2000 స్క్రీన్లలో వివిధ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 10 వేల స్క్రీన్లకుపైగా ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.

స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్ కి ప్రీక్వెల్‌గా వచ్చిన స్పైడర్ మ్యాన్: ఇంటు ది స్పైడర్-వెర్స్ లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించింది. అమెరికా, చైనా, ఇతర దేశాల్లో రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్నది.
స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్ చిత్రం ఇంగ్లీష్ వర్షన్ గత నాలుగు రోజుల్లో 13.5, హిందీ వెర్షన్ 4.53 కోట్లు, తెలుగు 32 లక్షలు, తమిళం 25 లక్షలు వసూలు చేసింది. ఈ చిత్రం నాలుగు రోజుల్లో పలు భాషల్లో సుమారు 19 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇంకా ఈ వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.
ఇండియాలో స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గురువారం 4.20 కోట్లు, శుక్రవారం 3.34 కోట్లు, శనివారం 5.19 కోట్లు, ఆదివారం 6.11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 19 కోట్ల షేర్, రూ.22 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్ మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన స్పైడర్ మ్యాన్: ఇంటు ది స్పైడర్-వెర్స్ జీవితకాల కలెక్షన్లకు రెండింతలు వసూలు చేసింది. స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్ చిత్రం అమెరికాలో వారాంతంలో $120.5 మిలియన్లు వసూలు చేసింది. 2023లో రెండో అతిపెద్ద ఓపెనింగ్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications











