Spider Verse 8 days collections 2000 కోట్ల మైలురాయిని దాటేసిన స్పైడర్ వెర్స్.. ఇండియాలో ఇంకా నష్టాల్లోనే..!
స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తున్నది. భారీ అంచనాలతో గత సిరీస్ కంటే మెరుగైన సాంకేతిక విలువలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రేడ్ అనలిస్టులు ఊహించినట్టే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇతర దేశాల్లో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది. ట్రేడ్ అనలిస్టుల అంచనాలు మంచి కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఇక గత 8 రోజుల్లో స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ చిత్రం ఎంత వసూలు చేసిందంటే?
స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను 100 మిలియన్ డాలర్లతో అంటే భారతీయ కరెన్సీలో సుమారు 8250 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఇక ఈ సినిమాను ఇండియాలో 2000 స్క్రీన్లలో వివిధ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 10 వేల స్క్రీన్లకుపైగా ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.

స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ మూవీ ఇండియాలో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 4.2 కోట్లు, రెండో రోజు 3.34 కోట్లు, మూడో రోజు 5.19 కోట్లు, నాలుగో రోజు 6.1 కోట్లు, 5వ రోజు 2.3 కోట్లు, 6 వ రోజు 2.2 కోట్లు, 7వ రోజు 2.14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత ఆరు రోజుల్లో 25 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.
స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ సినిమా వివిధ భాషల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇంగ్లీష్ వెర్షన్ వివరాల్లోకి తొలి రోజు 3.13 కోట్లు, రెండో రోజు 2.45 కోట్లు, మూడో రోజు 3.8 కోట్లు, నాలుగో రోజు 4.35 కోట్లు, ఐదో రోజు 1.5 కోట్లు, ఆరో రోజు 1.4 కోట్లు, ఏడో రోజు 1.36 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక హిందీ విషయానికి వస్తే.. తొలి రోజు 95 లక్షలు, రెండో రోజు 80 లక్షలు, మూడో రోజు 1.22 కోట్లు, నాలుగో రోజు 1.56 కోట్లు, ఐదో రోజు 72 లక్షలు, ఆరో రోజు 71, ఏడో రోజు 74 లక్షలు వసూలు చేసింది.

ఇక స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ సినిమా తెలుగు వెర్షన్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 7 లక్షలు, రెండో రోజు 5 లక్షలు, మూడో రోజు 10 లక్షల రూపాయలు, 4వ రోజు 10 లక్షల రూపాయలు, 5వ రోజు 4 లక్షల రూపాయలు, 6వ రోజు 5 లక్షల రూపాయలు, 7వ రోజు 4 లక్షల రూపాయలు వసూలు చేసింది.
స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అమెరికా, కెనడా మినహాయించి ఇతర దేశాల్లో 800 కోట్ల రూపాయలు, ఇండియాలో 29 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇంకా ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











