Spider Man Across the Spider Verse collections తొలి రోజే 12వేల కోట్లు..ఇండియాలో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న హాలీవుడ్ మూవీ సిరీస్ స్పైడర్ మ్యాన్. తాజాగా ఈ సిరీస్‌లో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్. ఈ చిత్రం రిలీజ్‌కు ముందు ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం ఇండియాలో గురువారం అంటే జూన్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? తొలి రోజు ఎంత సాధించింది? రెండో రోజు బాక్సాఫీస్ వద్ద అంచనాల ఎంత అనే విషయంలోకి వెళితే..
సోని పిక్చర్స్, మార్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జాక్విమ్ దోస్ సాంతోస్ దర్శకుడు. షామీక్ మూర్, హెయిలీ స్టెయిన్‌ఫీల్డ్, బ్రియాన్ టైరీ హెన్రీ, లూనా లారెన్ వీలెజ్, జేక్ జాన్సన్, ఇసా రే, కరణ్ సోని తదితరులు నటించారు. ఇక ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు భారీ అంచనాలు పెంచడంతో మంచి క్రేజ్ లభించింది.

స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ చిత్రం బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాను 100 మిలియన్ డాలర్లతో రూపొందింది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 8250 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఇక ఈ సినిమాను ఇండియాలో 1800 స్క్రీన్లలో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. తొలి రోజు కోసం 40 వేల టికెట్లు అమ్ముడుపోయాయి.
స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ చిత్రం రిలీజ్ తర్వాత అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ఫాస్ట్ X, యాంట్ మ్యాన్, వాస్ప్ క్వాటుమానియా, గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ, జాన్ విక్ 4 చిత్రాలతో పోటీ పడుతూ భారీగా అడ్వాన్స్ బుకింగ్ సొంతం చేసుకొన్నది. ఇండియాలో అత్యధికంగా ఓపెనింగ్స్ సాధించిన 5వ హాలీవుడ్ చిత్రంగా ఘనతను సాధించింది.
స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ చిత్రం వివిధ భాషల్లో ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. ఇంగ్లీష్ వెర్షన్ దాదాపు 45 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. హిందీ వెర్షన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తెలుగు వెర్షన్ ఓ మోస్తారుగా అంటే.. 20 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్ చాలా పేలవంగా ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇంగ్లీష్ వెర్షన్ 3.2 కోట్ల రూపాయల కలెక్షన్లను, హిందీ వెర్షన్ 1 కోటి రూపాయల వసూళ్లను, తెలుగు వెర్షన్ 70 లక్షల రూపాయలు, తమిళ వెర్షన్ సుమారు 50 లక్షల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం తొలి రోజున సుమారు 4.5 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది.
స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ చిత్రం రెండో రోజు కలెక్షన్ల అంచనాకు వస్తే.. పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ఈ సినిమా ఆక్యుపెన్సీ కూడా పేలవంగా నమోదైంది. అన్ని భాషల్లో కలిపి 15 శాతం ఆక్యుపెన్సీని రాబట్టలేకపోయింది. ఈ చిత్రం రెండో రోజున 3 కోట్ల రూపాయల నుంచి 3.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ చిత్రం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మొత్తంగా తొలి రెండు రోజుల్లో 150 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించే అవకాశం ఉంది. అమెరికాలో 90 మిలియన్ డాలర్లు, చైనాతో మిగితా దేశాల్లో ఈ చిత్రం 20 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా 12.35 వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.


Click it and Unblock the Notifications











