Spider Verse day 2 collections 2 రోజుల్లో 1000 కోట్ల కలెక్షన్ల సునామీ.. ఇండియాలో స్పైడర్ వెర్స్ కలెక్షన్లు ఎం
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సోని పిక్చర్స్, మార్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్. ఈ సినిమాకు జాక్విమ్ దోస్ సాంతోస్ దర్శకుడు. షామీక్ మూర్, హెయిలీ స్టెయిన్‌ఫీల్డ్, బ్రియాన్ టైరీ హెన్రీ, లూనా లారెన్ వీలెజ్, జేక్ జాన్సన్, ఇసా రే, కరణ్ సోని తదితరులు నటించారు. ఇక ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు భారీ అంచనాలు పెంచడంతో మంచి క్రేజ్ లభించింది. అయితే జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ సినిమా రెండో రోజున వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...
స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను 100 మిలియన్ డాలర్లతో అంటే భారతీయ కరెన్సీలో సుమారు 8250 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఇక ఈ సినిమాను ఇండియాలో 2000 స్క్రీన్లలో వివిధ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.

స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. గతంలో వచ్చిన స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో వచ్చిన చిత్రాలకు సొంతం చేసుకొన్న టాక్ రాకపోవడంతో వసూళ్లు మీడియం రేంజ్‌లో నమోదు అవుతున్నాయి. అయితే ఇండియాలో పెద్దగా ప్రభావం లేకపోయినప్పటికీ.. అమెరికా, చైనా, ఇతర దేశాల్లో భారీ వసూళ్లను రాబడుతున్నది.
స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ చిత్రం తొలి రోజున ఇంగ్లీష్ వెర్షన్ 3 కోట్లుపైగా వసూళ్లను సాధించింది. హిందీ వెర్షన్ కోటి రూపాయలు, తెలుగులో 7 లక్షలు, తమిళంలో 5 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా సుమారు 4.5 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద రాబట్టింది.
స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వస్తే.. ఇంగ్లీష్ వెర్షన్ 2.95 కోట్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్ 90 లక్షలు, తెలుగులో 5 లక్షలు, తమిళంలో 3 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఈ చిత్రం సుమారు 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం గత రెండు రోజుల్లో సుమారు 9.5 కోట్లు కలెక్ట్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ చిత్రం అమెరికా, చైనా, యూకే, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 40 మిలియన్ డాలర్లు అంటే 330 కోట్లు.. గత మూడు రోజుల్లో (ప్రీమియర్లు+రెండు రోజులు) 4300 స్క్రీన్ల ద్వారా 100 మిలియన్ డాలర్లు అంటే 825 కోట్ల రూపాయలు రాబట్టింది.


Click it and Unblock the Notifications











