Spider Man: Brand New Day Box Office: స్పైడర్ మ్యాన్ బాక్సాఫీస్ సంచలనం.. రిలీజ్‌కు ముందే ఎన్ని కోట్లంటే?

అమెరికన్ సూపర్ హీరో ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న మరో స్పైడర్ మ్యాన్ చిత్రం స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే (Spider-Man: Brand New Day). ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమాకు డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వం వహించారు. స్టాన్ లీ, స్టీవ్ డిటికో రచించిన స్పైడర్ మ్యాన్ పుస్తకం ఆదారంగా ఈ చిత్రాన్ని కెవిన్ ఫీజ్, ఆమీ పాస్కల్, అవి అరద్ నిర్మించారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్, జెండ్ా, సాదీ సింక్, జాకబ్ బాటాలాన్, జాన్ బెర్నథాల్ తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: బ్రెట్ పావ్లాక్, ఎఢిటింగ్: నాట్ సాండర్స్, జినా సన్సామ్, మ్యూజిక్: మైఖేల్ జియాచినో తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. మార్వెల్ స్టూడియోస్. పాస్కల్ పిక్చర్స్, సోని భాగస్వామ్యంలో ఈ చిత్రం జూలై 30వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

Spider Man Brand New Day Box Office Collections

స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న ఈ సినిమాను భారీ ఖర్చుతో రూపొందించారు. వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, ఆర్టిస్టుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్ కలిపి ఈ సినిమాను సుమారుగా 220 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 2100 కోట్ల రూాయల వ్యయంతో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషనల్ కాస్ట్‌తో కలిపి దాదాపు 275 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 2620 కోట్ల రూపాయల బడ్జెట్‌ అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌కు భారీగా స్పందన కనిపిస్తున్నది. నార్త్ అమెరికా, యూకే, యూరోపియన్ దేశాలతోపాటు ఆసియా దేశాల్లో రికార్డు కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. రిలీజ్‌కు ముందే రికార్డు స్థాయిలో ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా కలెక్షన్ల వ్వవహారం క్రేజీగా మారింది.

స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా ట్రేడ్ అంచనాల వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే ఈ చిత్రం 50 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 500 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా త్వరలో విడుదల కానున్న క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన ఒడిస్సీ సినిమా వసూళ్లను డామినేట్ చేస్తున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమా తొలి వారాంతం కలెక్షన్లను ట్రేడ్ వర్గాలు భారీ స్థాయిలో అంచనా వేస్తున్నాయి. తొలి మూడు రోజుల వారాంతంలో ఈ చిత్రం 230 మిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చు. అంటే భారతీయ కరెన్సీలో 2200 కోట్ల రూపాయల మేర వసూళ్లను నమోదు చేయడం గ్యారెంటీగా కనిపిస్తున్నది. పాజిటివ్ టాక్ వస్తే..ఈ రేంజ్ అనూహ్యంగా పెరుగుతుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

స్పైడర్ మ్యాన్ సినిమా థియేట్రికల్ రన్‌లో రికార్డు వసూళ్లను రాబట్టడం ఖాయం. ఈ చిత్రం అవలీలగా 1 బిలియన్ డాలర్లు అంటే 9500 కోట్లకుపైగా వసూళ్లను సాధిస్తుంది. ఈ సినిమా కంటెంట్ ఆడియెన్స్ కనెక్ట్ అయితే.. 2 బిలియన్ డాలర్లు కూడా వసూలు చేసే అవకాశం ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో 19000 కోట్ల వసూలు చేయడానికి స్కోప్ ఉన్న సినిమా అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Read more about: box office report tom holland
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X