Spider Man Day 1 Box Office: రిలీజ్‌కు ముందే స్పైడర్ మ్యాన్ కలెక్షన్ల సంచలనం.. ప్రపంచవ్యాప్తంగా రికార్డుల హోరు

అమెరికన్ సూపర్ హీరో ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న మరో స్పైడర్ మ్యాన్ చిత్రం స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే (Spider-Man: Brand New Day). స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో ఇది నాలుగోది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమాకు డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వం వహించారు. స్టాన్ లీ, స్టీవ్ డిటికో రచించిన స్పైడర్ మ్యాన్ పుస్తకం ఆదారంగా ఈ చిత్రాన్ని కెవిన్ ఫీజ్, ఆమీ పాస్కల్, అవి అరద్ నిర్మించారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్, జెండ్ా, సాదీ సింక్, జాకబ్ బాటాలాన్, జాన్ బెర్నథాల్ తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: బ్రెట్ పావ్లాక్, ఎఢిటింగ్: నాట్ సాండర్స్, జినా సన్సామ్, మ్యూజిక్: మైఖేల్ జియాచినో తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. మార్వెల్ స్టూడియోస్. పాస్కల్ పిక్చర్స్, సోని భాగస్వామ్యంలో ఈ చిత్రం జూలై 30వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు ఇండియాలోనే కాకుండా పలు దేశాల్లో భారీగా స్పందన కనిపిస్తున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్, తొలి రోజు కలెక్షన్ల అంచనాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Spider Man Brand New Day Prediction of Day 1

ఇండియాలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో స్పైడర్ మ్యాన్ చిత్రానికి అనూహ్యమైన రెస్పాన్స్ బాక్సాఫీస్ వద్ద కనిపిస్తున్నది. ఈ సినిమాకు నైజాం, ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, నార్త్ ఇండియాలో భారీ వసూళ్లను రాబడుతున్నది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తొలి మూడు రోజుల అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నది. ఈ చిత్రం ఇప్పటికే 40 కోట్లకుపైగా కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇక ఈ సినిమాకు నార్త్ అమెరికాలో సంచలన రీతిలో వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ చిత్రం ప్రీ సేల్స్ ద్వారా ఇప్పటికే 100 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 958 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజు ఈ చిత్రం 70 మిలియన్ డాలర్లు అంటే.. 670 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అని అంచనా వేస్తున్నారు. అయితే తొలి వారాంతం అంటే.. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 300 మిలియన్ డాలర్లు అంటే.. 2700 కోట్ల రూపాయలు కేవలం అమెరికా, కెనడాలోనే వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తున్నది. ఈ చిత్రానికి యూకే, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇతర యూరోపియన్ దేశాలు, అలాగే సౌత్ ఏషియా, గల్ఫ్ దేశాల్లో అంచనాలు మించి వసూళ్లను సాధిస్తుండటం ట్రేడ్ వర్గాల్లో జోష్ కనిపిస్తున్నది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో తొలి వారాంతం 300 మిలియన్ డాలర్లు అంటే.. 2700 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. ఈ చిత్రం ఇండియాలో తొలి రోజు 60 కోట్ల రూపాయలు కనీసం వసూలు చేయవచ్చు. ఇంకా టాక్ బాగా ఉంటే.. ఇంకా ఎక్కువనే కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తొలి వారాంతం 500 నుంచి 600 మిలియన్ డాలర్లు అంటే.. 4500 కోట్ల నుంచి 6500 కోట్ల మధ్య కలెక్షన్లను వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X