twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Spider Man 18 days collections.. ప్రపంచవ్యాప్తంగా 10200 కోట్ల కలెక్షన్లు.. ఇండియాలో ఎంత వసూలు చేసిందంటే?

    |

    ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కరోనావైరస్ పరిస్థితులను అధిగమించి స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది. ఓ వైపు థియేటర్లలో ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ ఈ చిత్రం ఇండియాలోనే కాకుండా విడుదలైన పలు దేశాల్లో రికార్డు వసూళ్లను నమోదుచేస్తున్నది. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ చిత్రం 2021లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రం రికార్డును తన ఖాతాలో వేసుకొన్నది. స్పైడర్ మ్యాన్ 18 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

     దేశవ్యాప్తంగా 18 రోజుల్లో వసూళ్లు

    దేశవ్యాప్తంగా 18 రోజుల్లో వసూళ్లు

    ప్రముఖ నిర్మాణ సంస్థ సోని పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ చిత్రం భారత్‌లో విడుదలైంది. ఈ చిత్రం 18 రోజుల్లో భారీ వసూళ్లు సాధించిన మూడో హాలీవుడ్ చిత్రంగా రికార్డు సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా 202 కోట్ల నికర వసూళ్లు, 260 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

     ఇండియాలో రెండు వారాల్లో

    ఇండియాలో రెండు వారాల్లో

    గత మూడు వారాలకు సంబంధించిన స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి వారం ఈ చిత్రం 189.69 కోట్ల గ్రాస్ వసూళ్లను, 148 కోట్ల నికర కలెక్షన్లను రాబట్టింది. ఇక రెండో వారం విషయానికి వస్తే.. 53. 66 కోట్ల గ్రాస్ వసూళ్లను, 41.60 కోట్ల నికర వసూళ్లను కలెక్ట్ చేసింది.

     మూడో వారంలో

    మూడో వారంలో

    ఇక మూడో వారంలో తొలి రోజున అంటే శుక్రవారం 3.84 కోట్ల గ్రాస్, 3 కోట్ల నికర వసూళ్లను, అలాగే శనివారం 6.35 గ్రాస్ వసూళ్లను, 4.92 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఇక ఆదివారం రోజున నిలకడగా వసూళ్లను రాబట్టి.. 6.13 గ్రాస్ వసూళ్లను, 4.75 నికర వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఓవరాల్‌గా ఈ చిత్రం 259.67 కోట్ల గ్రాస్ వసూళ్లను, 202.34 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఇలా...

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఇలా...

    ఇక అమెరికాలో స్పైడర్ మ్యాన్ వసూళ్ల వివరాల్లోకి వెళితే.. గత 18 రోజుల్లో ఈ చిత్రం $52.7 మిలియన్లు అంటే.. 391 కోట్ల రూపాయాల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. గత రెండేళ్లలో అమెరికాలో అతిపెద్ద కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు సొంతం చేసుకొన్నది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 1.37 బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే... 10, 200 కోట్లు వసూలు చేసింది.

    Recommended Video

    Upasana Wished To Ramcharan In A Special Way
     చైనా, జపాన్ దేశాల పరిస్థితి ఏమిటంటే?

    చైనా, జపాన్ దేశాల పరిస్థితి ఏమిటంటే?

    అయితే కోవిడ్ పరిస్థితుల కారణంగా స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ సినిమా పలు దేశాల్లో రిలీజ్ వాయిదా పడింది. చైనా, జపాన్ లాంటి అతిపెద్ద దేశాల్లో ఇంకా రిలీజ్ కాకపోవడం గమనార్హం. ఒకవేళ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో రిలీజ్ అయి ఉంటే ఇంకా రికార్డు కలెక్షన్లు సాధించే అవకాశం ఉండేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    English summary
    Spider-Man No Way Home released on december 16 in India and released 17th worldwide. Spider-Man: No Way Home grossed an estimated $52.7 million over the weekend in the US. It’s three-week total Worldwide stands at $1.37 billion, with China and Japan yet to release the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X