Spider-Man 12 days Collections.. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ... భారత్‌లో 200 కోట్ల అరాచకం!
మార్వెల్ సంస్థ రూపొందించిన స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపుతున్నది. 2021లో ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డును తిరగరాసింది. అంతేకాకుండా ఒక బిలియన్ డాలర్లు వసూలు చేసిన సినిమాగా సరికొత్త రికార్డును సాధించింది. గత 11 రోజుల్లో స్పైడర్ మ్యాన్ చిత్రం ఎంత వసూలు చేసిందంటే..

200 కోట్ల క్లబ్‌లో చేరేందుకు
కోవిడ్ పరిస్థితుల కారణంగా రెండేళ్లుగా సంక్షోభంలో కూరుకుపోయిన సినీ పరిశ్రమకు స్పైడర్ మ్యాన్ చిత్రం జోష్‌ను పెంచింది. ముఖ్యంగా భారత్ బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టించింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా 200 కోట్ల కలెక్షన్లకు చేరువైంది. త్వరలోనే ఈ సినిమా 200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

రెండు వారాంతాల్లో వసూళ్లు
ఇటీవల కాలంలో స్పైడర్ మ్యాన్ చిత్రం అతిపెద్ద ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. రెండో వారాంతం తర్వాత కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబడుతున్నది. తొలి వారంలో 175 కోట్లు రాబట్టిన ఈ చిత్రం 200 క్లబ్‌వైప్ దూసుకెళ్తున్నది. రెండోవారంలో శుక్రవారం 6.75 కోట్లు, శనివారం 10.10 కోట్లు, ఆదివారం 10 కోట్లు, సోమవారం 4.45 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రూ.180 కోట్ల నికర వసూళ్లను సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్స్
ఇక ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ సినిమా సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.. కేవలం 11 రోజుల్లోనే 1 బిలియన్ అమెరికన్ డాలర్లను సొంతం చేసుకొన్నది. భారతీయ కరెన్సీ లెక్కిస్తే.. ఈ సినిమా సుమారు 750 కోట్ల రూపాయలను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

ఉత్తర అమెరికాలో మేజర్ షేర్
స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ సినిమా ఉత్తర అమెరికాలో మేజర్ షేర్ రాబట్టింది. నార్త్ అమెరికాలో చిత్రం 467.33 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇక భారత్‌తోపాటు మిగితా దేశాల్లో 587.10 మిలియన్ డాలర్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 1.05 బిలియన్ డాలర్లు నమోదు చేసింది. త్వరలోనే ఈ సినిమా హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఘనతను సొంతం చేసుకొనే అవకాశాలు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వసూళ్లు..
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వసూళ్లు సాధించిన సినిమాల విషయానికి వస్తే..
అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం 2.7 బిలియన్ డాలర్లు,
లయన్ కింగ్ చిత్రం 1.6 బిలియన్ డాలర్లు
ఫ్రోజెన్ చిత్రం 1.4 బిలియన్ డాలర్లు
కెప్టెన్ మార్వెల్ చిత్రం 1.1 మిలియన్ డాలర్లు
జోకర్ చిత్రం 1 బిలియన్
స్టార్ వార్స్ 9 చిత్రం 1 బిలియన్ డాలర్లు
అల్లాదీన్ 1 బిలియన్ డాలర్లు
స్పైడర్ మ్యాన్ చిత్రం 1 బిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











