Spirit AP TG Business: స్పిరిట్‌కు ఆంధ్రా, నైజాంలలో రికార్డ్ బిజినెస్? ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ స్పిరిట్. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాల తర్వాత సందీప్ తెరకెక్కిస్తోన్న మూవీ కావడం.. పైగా ప్రభాస్ హీరో కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజ్‌కు తగినట్లుగా స్పిరిట్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా సెట్స్ మీద ఉండగానే డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. తాజాగా ఆంధ్రా, నైజాంలలో స్పిరిట్ హక్కులకు మంచి రేటు పలికినట్లుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
స్పిరిట్ కాస్ట్ అండ్ క్రూ
భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్సన్, టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగాలు స్పిరిట్ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, అలనాటి నటి కాంచనలు కీలకపాత్ర పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా... రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా, సుప్రీం సుందర్ యాక్షన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 2027 మార్చి 5న స్పిరిట్ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, జపనీస్, కొరియన్, మాండ్రిన్ భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

స్పిరిట్ సెట్‌లో అగ్నిప్రమాదం
ఇటీవలే ప్రభాస్.. స్పిరిట్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. దర్శకుడు సందీప్ షెడ్యూల్స్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో స్పిరిట్ షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ వేసిన సెట్‌లో ప్రభాస్ ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం స్పిరిట్ సెట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ ఘటనలో సెట్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లు, షూటింగ్ పరికరాలు కాలిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాస్ ఘటనాస్థలిలో లేకపోవడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది.
పోలీస్‌గా ప్రభాస్
స్పిరిట్ మూవీలో కెరీర్‌లో తొలిసారిగా ప్రభాస్ పోలీస్ యూనిఫాంలో కనిపించనున్నారు. ఇప్పటికే ఫ్యాన్ మేడ్ పోస్టర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇటీవలే హైదరాబాద్ ఏఎంబీ మాల్‌లో ప్రభాస్, సందీప్ రెడ్డిలు ధురంధర్ 2 చిత్రాన్ని వీక్షించారు. ప్రభాస్ మ్యాన్లీ లుక్‌లో చాలా అందంగా కనిపిస్తున్నారు. మరి ప్రభాస్ క్యారెక్టర్‌ను సందీప్ ఎలా డిజైన్ చేశారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ఏపీ, తెలంగాణ హక్కులు ఆ సంస్థ చేతికి?
ఇదిలాఉండగా.. స్పిరిట్ బిజినెస్‌కు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు సహా అన్ని భాషలకు చెందిన స్పిరిట్ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 250 కోట్ల రేంజ్‌లో దక్కించుకుందని తెలుస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో స్పిరిట్ థియేట్రికల్ బిజినెస్ కూడా మేకర్స్ క్లోజ్ చేసినట్లుగా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం ఆంధ్రా- నైజాం ఏరియాల స్పిరిట్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే డీల్ వాల్యూ ఎంత? అనేది మాత్రం తెలియరాలేదు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications

















