SR Kalyanamandapam Day10 collections.. కిరణ్ అబ్బవరం బాక్సాఫీస్ దెబ్బ.. ఇప్పటికే ఎన్ని కోట్ల లాభమంటే..
టాలీవుడ్‌లో చిన్న చిత్రంగా రిలీజై భారీ విజయాన్ని అందుకొన్న SR కల్యాణమండపం చిత్రం రెండో వారాంతంలో కూడా మంచి కలెక్షన్లను అందుకొన్నది. ఏపీ, తెలంగాణలో కొత్తగా విడుదలైన సినిమాలకు ధీటుగా వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కిరణ్ అబ్బవరం నటించిన సీడెడ్, రాయలసీమ ప్రాంతాల్లో బాక్సాఫీస్ నంబర్లు ఓ రేంజ్‌లో ఉండటం సినిమా కంటెంట్ స్టామినాను మరోసారి గుర్తు చేసింది. SR కల్యాణమండపం 10వ రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..
Recommended Video

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..
SR కల్యాణమండపం సినిమా ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ.4.55 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాకు ఈ రేంజ్‌లో ఇలాంటి బిజినెస్ జరగడం ఇదే తొలిసారి. దాంతో ఈ సినిమా సుమారు రూ.5 కోట్ల లక్ష్యంతో బాక్సాఫీస్ బరిలోకి దిగింది.

పదో రోజున కలెక్షన్లు ఎంతంటే..
మాస్, ఎమోషనల్ అంశాలతో తెరకెక్కిన SR కల్యాణమండపం చిత్రం తొలి ఆట నుంచి గుడ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. పదో రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.25 లక్షల నికర వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం భారీ లాభాల్లో కొనసాగుతున్నది. ఈ మధ్య కాలంలో ఏ చిన్న సినిమా సాధించని రికార్డు కలెక్షన్లు రాబట్టింది.

మొత్తం 10 రోజుల కలెక్షన్లు ఇలా..
SR కల్యాణమండపం సినిమా 10 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే... నైజాంలో రూ.2.56 కోట్లు, సీడెడ్‌లో రూ.1.48 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 85 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 49 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.33 లక్షలు, గుంటూరులో రూ. 61 లక్షల రూపాయాలు, కృష్ణ జిల్లాలో రూ.31 లక్షలు, నెల్లూరులో రూ.10 లక్షలు వసూలు చేసింది. దీంతో 10 రోజుల్లో రూ.6.81 కోట్ల నికర వసూళ్లు, రూ.11.15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

కర్ణాటక, ఓవర్సీస్‌లో
ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగితా రాష్ట్రాల్లో డిసెంట్ వసూళ్లను నమోదు చేసింది. కర్నాటక, ఇతర రాష్ట్రాల్లో 18 లక్షల నికర వసూళ్లను, ఓవర్సీస్‌లో 38 లక్షల నికర వసూళ్లను రాబట్టింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.7.37 కోట్ల నికర వసూళ్లు, రూ.13.41 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొన్నది.

ఒక్కో రోజు ఏ మేరకు కలెక్షన్లు అంటే
SR కల్యాణమండపం సినిమా రిలీజ్ అనంతరం ఒకటో రోజున రూ.1.40 కోట్లు, రెండో రోజున 1.25 కోట్లు, మూడో రోజున రూ.1.40 కోట్లు, నాలుగో రోజున రూ.74 లక్షలు, ఐదో రోజున రూు.60 లక్షలు, ఏడో రోజున రూ.37 లక్షలు, ఎనిమిదో రోజున రూ.21 లక్షలు, తొమ్మిదో రోజున రూ.13 లక్షలు, పదో రోజున రూ.25 లక్షలు వసూలు చేసింది.

10 రోజుల తర్వాత ఎంత లాభమంటే?
SR కల్యాణమండపం సినిమా సుమారు 5 కోట్లు వస్తే లాభాల్లోకి ప్రవేశిస్తుందనే ట్రేడ్ వర్గాల టాక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 10 రోజుల్లో రూ.7.37 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో ఈ చిత్రం రూ. 2.5 కోట్లకుపైగా లాభాలను సాధించింది. ఇటీవల కాలంలో ఈ రేంజ్ లాభాలను సాధించిన చిత్రంగా SR కల్యాణమండపం సినిమాను చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











