Mrithyunjay Day 2 Collections: మృత్యుంజయ్ షాకింగ్ కలెక్షన్స్.. శ్రీవిష్ణు మూవీకి ఎన్ని కోట్లంటే?
Mrithyunjay Box Office Collections: టాలీవుడ్‌లో విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నటుల్లో హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) ఒకరు. తాజాగా శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా మృత్యుంజయ్ (Mrithyunjay) మార్చి 6 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ మూవీ మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ కథాంశం చుట్టూ తిరుగుతుంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కథలో ఉన్న ట్విస్టులు, సస్పెన్స్ అంశాలు ప్రేక్షకుల్లో భారీ క్యూరియాసిటీని పెంచేశాయి. దీంతో 'మృత్యుంజయ్' సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా 2 రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
యాక్షన్-ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన 'మృత్యుంజయ్' సినిమాకు శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోగా శ్రీ విష్ణు నటించగా, ఆయన సరసన హీరోయిన్‌గా రెబ్బా మోనికా జాన్ కనిపించారు. కీలక పాత్రల్లో రచ్చ రవి, సిజ్జు, మిర్చి మాధవి, సుదర్శన్, కృష్ణ కౌశిక్ తదితరులు నటించారు. ఈ సినిమాను లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. సంగీతాన్ని కాలభైరవ అందించగా, సినిమాటోగ్రఫీని విద్యాసాగర్ చింతా నిర్వహించారు. ఎడిటింగ్ బాధ్యతలను ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ చేపట్టారు.

థియేట్రికల్ బిజినెస్
శ్రీ విష్ణు సినిమాలకు ఓ ప్రత్యేక మార్కెట్ ఉందని చెబుతుంటారు. 'మృత్యుంజయ్' సినిమా కూడా సుమారు రూ.20 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కినట్టు సమాచారం.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 'మృత్యుంజయ్' సినిమాకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.6 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇందులో నైజాం ప్రాంతం నుంచి దాదాపు రూ.2.5 కోట్లు, సీడెడ్ నుంచి సుమారు రూ.0.40 కోట్లు, ఆంధ్ర ప్రాంతాల నుంచి కలిపి సుమారు రూ.2.2 కోట్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి సుమారు రూ.0.40 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు రూ.0.50 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సుమారు రూ.6.5 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.
మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్
హీరో శ్రీ విష్ణు సినిమాకు విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ట్రెడ్ రిపోర్టుల ప్రకారం.. మృత్యుంజయ్ సినిమా విడుదలైన మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిందట. ప్రముఖ ట్రాకింగ్ వెబ్‌సైట్ సాక్‌నిల్క్ నివేదిక ప్రకారం ఈ సినిమాకు తొలి రోజు మొత్తం తెలుగు ఆక్యుపెన్సీ సుమారు 19.85 శాతం నమోదైంది. షోల వారీగా చూస్తే.. మార్నింగ్ షో 18.70 శాతం, మ్యాటినీ షో 17.67 శాతం,ఈవెనింగ్ షో 16.38 శాతం, నైట్ షో 26.63 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. రోజంతా చూస్తే నైట్ షోలలోనే అత్యధికంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
అయితే.. ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేదని చెప్పాలి. ఈ మూవీతో 'సాంప్రదాయిని సుప్పిణి సుద్దపూసాని' మూవీ పోటీ పడుతుంది. ఈ చిత్రంలో హీరో శివాజీ ప్రధాన పాత్రలో నటించగా, ఆయనతో పాటు సీనియర్ నటి లయ కూడా కీలక పాత్రలో కనిపించారు. చాలా కాలం తర్వాత ఈ జంట మళ్లీ తెరపై కనిపించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు తొలి రోజు పెద్దగా స్పందన కనిపించలేదు. సాక్‌నిల్క్ నివేదిక ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు సుమారు రూ. 0.75 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సాధించింది.
ఇక రెండో కలెక్షన్స్ అంచనాలను చూస్తే.. వీకెండ్ కారణంగా శనివారం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకూ వసూలు చేసే అవకాశం ఉంది. దీంతో ప్రపంచవ్యాపంగా రెండు రోజుల్లో రూ. 3 కోట్ల వరకు చేరుకోనే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద 'మృత్యుంజయ్' సినిమాకు 'సాంప్రదాయిని సుప్పిణి సుద్దపూసాని' కంటే మెరుగైన ఓపెనింగ్ లభించింది. ప్రేక్షకుల నుంచి వచ్చే మౌత్ టాక్ బాగుంటే ఈ సినిమా రాబోయే రోజుల్లో మరింత మంచి కలెక్షన్స్ సాధించే అవకాశముంది. ఇప్పుడు వీకెండ్ రోజుల్లో ఈ రెండు సినిమాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద మెరుగైన ప్రదర్శన చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











