Samajavaragamana Collections: శ్రీవిష్ణుకు జాక్ పాట్.. నిర్మాతలకు అన్ని కోట్ల లాభాలు! ఎంతంటే?

తెలుగులో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. చిన్న చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ అలరించిన శ్రీ విష్ణు తర్వాతి కాలంలో కథానాయకుడిగా మారాడు. తనను తాను ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఇటీవల అల్లూరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలవడంతో తర్వాత ఎలాగైనా కమ్ బ్యాక్ కొట్టేందుకు అన్నట్లుగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా సామజవరగమనతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి కలెక్షన్స్ కొల్లగొడుతున్న ఈ సినిమాకు 21వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

అతని మ్యూజిక్:ద్రిష్టి, వివాహభోజనంబు వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన సినిమా సామజవరగమన. ఇందులో శ్రీ విష్ణుకు జోడీగా మలయాళ భామ రెబ్బ మౌనిక జాన్ హీరోయిన్ గా ఆకట్టుకుంది. జూన్ 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందించారు.

Sree Vishnu Samajavaragamana 21 Days Official Worldwide Box Office Collection

ప్రీ రిలీజ్ బిజినెస్:పూర్తి హాస్యభరిత కుటుంబకథా చిత్రంగా వచ్చింది శ్రీ విష్ణు నటించిన సామజవరగమన. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే బాలయ్య డైలాగ్ కాస్తా కాంట్రవర్సీ కూడా అయింది. అయినా సినిమాకు మంచి మార్కెట్ జరిగింది. సామజవరగమన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 3.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా.. రూ. 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది.

21వ రోజు:సామజవరగమన సినిమాకు మొదట్లో వసూళ్లు బాగా వచ్చాయి. తర్వాత రోజులు గడవటం, ఇతర సినిమాల పోటీతో కాస్తా వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో 21వ రోజున ఏపీ తెలంగాణలోని నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలిపుకుని మొత్తంగా రూ. 11 లక్షల కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Sree Vishnu Samajavaragamana 21 Days Official Worldwide Box Office Collection

21 రోజుల్లో-తెలుగులో:గోపి సుందర్ మ్యూజిక్ అందించిన సామజవరగమన సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 21 రోజుల్లో కలెక్షన్స్ పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ మూవీకి 21 రోజుల్లో నైజాంలో రూ. 4.45 కోట్లు, సీడెడ్ లో రూ. 1.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.82 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 80 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 54 లక్షలు, గుంటూరులో రూ. 76 లక్షలు, కృష్ణాలో రూ. 78 లక్షలు, నెల్లూరులో రూ. 42 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి.

Sree Vishnu Samajavaragamana 21 Days Official Worldwide Box Office Collection

ప్రపంచవ్యాప్తంగా:శ్రీ విష్ణు సామజవరగమన చిత్రానికి 21 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.63 కోట్ల షేర్, రూ. 20.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాలన్నీ కలిపి 21 రోజులకు రూ. 4.74 కోట్లు కలెక్ట్ అయింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా సామజవరగమనకు 21 రోజుల్లో రూ. 15.37 కోట్లు షేర్, రూ. 31.30 గ్రాస్ కలెక్ట్ అయింది. వరల్డ్ వైడ్ గా 21వ రోజునే రూ. 40 లక్షల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది.

Sree Vishnu Samajavaragamana 21 Days Official Worldwide Box Office Collection

లాభాలు-హిట్:సామజవరగమన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. దీంతో ఈ చిత్రానికి 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 15.37 కోట్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను 3 రోజుల్లోనే పూర్తి చేసుకున్న సామజవరగమన చిత్రం నిర్మాతలకు ఇప్పటికీ రూ. 11.87 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. దీంతో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ గా శ్రీ విష్ణు ఖాతాలో హిట్ పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X