Samajavaragamana Collections: శ్రీ విష్ణు వసూళ్ల సునామీ.. ఆ క్లబ్‌లో సామజవరగమన.. ఆ లాభాలు ఏంటీ సామీ?
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఎక్కువగా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ చిత్రాలతో అలరిస్తూ ఉంటాడు.
కామెడీ టైమింగ్, డైలాగ్ డెలీవరీతో అభిమానులను సంపాదించుకున్న శ్రీ విష్ణు తాజాగా నటించిన చిత్రం సామజవరగమన. టీజర్, ట్రైలర్ నుంచే పాజిటివ్ రెస్పాన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామజవరగమన చిత్రానికి కలెక్షన్స్ బాగున్నాయి. ఈ క్రమంలో సినిమాకు 10 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయనే లెక్కల్లోకి వెళితే..

కామెడీతో: తెలుగులో ద్రిష్టి, వివాహభోజనంబు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన రామ్ అబ్బరాజు తెరకెక్కించిన సినిమా సామజవరగమన. ఈ మూవీలో శ్రీ విష్ణుకు హీరోయిన్ గా మాలీవుడ్ క్యూట్ బ్యూటి రెబ్బ మౌనిక జాన్ నటించింది. జూన్ 29న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ వీకే నరేష్, వెన్నెల కిశోర్ తదితరులు కామెడీతో అలరించారు.

ఎంత బిజినెస్?: సామజవరగమన సినిమా టీజర్, ట్రైలర్ తో మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక రూ. 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా 500 థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సామజవరగమన మూవీకి ప్రపంచవ్యాప్తంగా గా రూ. 3.20 కోట్ల బిజినెస్ అయినట్లు సమాచారం.
ఏపీ, తెలంగాణలో: సామజవరగమన చిత్రానికి 10వ రోజున నైజాంలో రూ. 32 లక్షలు, సీడెడ్ రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 4 లక్షలు, గుంటూరు రూ. 6 లక్షలు, కృష్ణా రూ. 6 లక్షలు, నెల్లూరు రూ. 3 లక్షలు వచ్చాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 10వ రోజు రూ. 80 లక్షల షేర్, రూ. 1.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది.

10 రోజుల్లో: సామజవరగమన సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఊపందుకున్నాయి. దీంతో 10 రోజుల్లో ఈ సినిమాకు నైజాంలో రూ. 2.99 కోట్లు, సీడెడ్ లో రూ. 90 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.02 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 53 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 37 లక్షలు, గుంటూరులో రూ. 50 లక్షలు, కృష్ణాలో రూ. 52 లక్షలు, నెల్లూరులో రూ. 29 లక్షలు వసూలు అయింది.

వరల్డ్ వైడ్ గా: శ్రీ విష్ణు సామజవరగమనకు 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.12 కోట్ల షేర్, రూ. 13.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాలన్నీ కలిపి 10 రోజులకు రూ. 3.25 కోట్లు కలెక్ట్ అయింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా శ్రీవ విష్ణు సామజవరగమనకు 10 రోజుల్లో రూ. 10.37 కోట్లు షేర్, రూ. 20.35 గ్రాస్ కలెక్ట్ అయింది. అంటే 10 రోజుల్లో సినిమా రూ. 20 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

లాభాలు ఎంతంటే?: శ్రీ విష్ణు లేటెస్ట్ సినిమా సామజవరగమనకు ప్రపంచవ్యాప్తంగా రూ. 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. దీంతో ఈ చిత్రానికి 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 10.37 కోట్లు వచ్చాయి. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసుకుని రూ. 6.87 కోట్ల లాభాలు సాధించింది. దీంతో సామజవరగమన చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











