Samajavaragamana Collections: శ్రీ విష్ణు కలెక్షన్ల రికార్డ్.. బడ్జెట్‌ను దాటేసిన లాభాలు.. ఎన్ని కోట్లంటే?

తెలుగులో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. చిన్న పాత్రలు పోషిస్తూ కథానాయకుడిగా తనను తాను ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఇటీవల పోలీస్ ఆఫీసర్ గా చేసిన అల్లూరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. దీని నుంచి కమ్ బ్యాక్ కొట్టేందుకు అన్నట్లుగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన సామజవరగమన కలెక్షన్లతో జోరు మీదుంది. ఈ నేపథ్యంలో సామజవరగమన సినిమాకు 12 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

నవ్వులతో ప్రేక్షకులు:టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు, మలయాళ అందాల సుందరి రెబ్బ మౌనిక జాన్ తొలిసారిగా జంటగా నటించిన మూవీ సామజరవరగమన. ద్రిష్టి, వివాహభోజనంబు వంటి సినిమాలను తెరకెకక్కించిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన సామజవరగమన సినిమాలో వీకే నరేష్, వెన్నెల కిశోర్ పండించిన హాస్యానికి తెలుగు ప్రేక్షకులు తెగ నవ్వుకున్నారని రివ్యూలు వచ్చాయి.

Sree Vishnu Samajavaragamana Movie 12 Days Official Worldwide Box Office Collection

ప్రీ రిలీజ్ బిజినెస్:పూర్తి హాస్యంభరితంగా, కుటుంబకథా చిత్రంగా వచ్చింది శ్రీ విష్ణు సామజవరగమన. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే బాలయ్య డైలాగ్ కాస్తా కాంట్రవర్సీ కూడా అయింది. అయినా సినిమాకు మంచి మార్కెట్ జరిగింది. సామజవరగమన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 3.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా.. రూ. 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది.

12వ రోజు:సామజవరగమన మూవీకి నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్ రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 2 లక్షలు, గుంటూరు రూ. 3 లక్షలు, కృష్ణా రూ. 2 లక్షలు, నెల్లూరు రూ. 1 లక్ష ఇలా అన్ని ఏరియాలు కలుపుకుని రూ. 35 లక్షలు షేర్, రూ. 75 లక్షల గ్రాస్ వసూలు అయింది. మండే ఎఫెక్టుతో కాస్తా వసూళ్లు తగ్గినట్లుగా తెలుస్తోంది.

Sree Vishnu Samajavaragamana Movie 12 Days Official Worldwide Box Office Collection

12 రోజుల్లో-తెలుగులో:గోపి సుందర్ మ్యూజిక్ అందించిన సామజవరగమన చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఈ మూవీకి 12 రోజుల్లో నైజాంలో రూ. 3.53 కోట్లు, సీడెడ్ లో రూ. 99 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.21 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 64 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 45 లక్షలు, గుంటూరులో రూ. 61 లక్షలు, కృష్ణాలో రూ. 63 లక్షలు, నెల్లూరులో రూ. 34 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి.

Sree Vishnu Samajavaragamana Movie 12 Days Official Worldwide Box Office Collection

ప్రపంచవ్యాప్తంగా:శ్రీ విష్ణు సామజవరగమన చిత్రానికి 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.40 కోట్ల షేర్, రూ. 15.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాలన్నీ కలిపి 12 రోజులకు రూ. 3.65 కోట్లు కలెక్ట్ అయింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా సామజవరగమనకు 12 రోజుల్లో రూ. 12.05 కోట్లు షేర్, రూ. 23.85 గ్రాస్ కలెక్ట్ అయింది.

Sree Vishnu Samajavaragamana Movie 12 Days Official Worldwide Box Office Collection

లాభాలు:సామజవరగమన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. దీంతో ఈ చిత్రానికి 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 12.05 కోట్లు వచ్చాయి. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కాగా.. రూ. 8.55 కోట్ల లాభంతో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంటే రూ. 8 కోట్ల బడ్జెట్ ని లాభాలు దాటి మరి శ్రీ విష్ణు సామజవరగమన రికార్డ్ కొట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X