Samajavaragamana Collections: శ్రీ విష్ణు కలెక్షన్ల మోత.. లాభాల సునామీ.. 15 రోజుల్లో ప్రాఫిట్ తెలిస్తే!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు. మొదటి నుంచి డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఎక్కువగా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ చిత్రాలతో అలరిస్తూ ఉంటాడు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలీవరీతో అభిమానులను పెంచుకున్నాడు.
అలాంటి శ్రీ విష్ణు తాజాగా నటించిన చిత్రం సామజవరగమన. మొదటి నుంచే పాజిటవ్ వైబ్రేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామజవరగమన చిత్రానికి కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు 15 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయనే లెక్కలు చూస్తే..

మలయాళ ముద్దుగుమ్మ: ద్రిష్టి, వివాహభోజనంబు వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన తాజా సినిమానే సామజవరగమన. ఇందులో శ్రీ విష్ణుకు జోడీగా మాలీవుడ్ క్యూట్ బ్యూటి రెబ్బ మౌనిక జాన్ హీరోయిన్ గా చేసింది. జూన్ 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ వీకే నరేష్, వెన్నెల కిశోర్ తదితరులు కామెడీతో అలరించారని టాక్ వస్తోంది.

ఎంత బిజినెస్ అంటే?: సామజవరగమన చిత్రం టీజర్, ట్రైలర్ తో మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక రూ. 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమాను వరల్డ్ వైడ్ గా 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడు కాస్తా స్క్రీన్స్ తగ్గినా ఈ సినిమాకు మంచి బిజినెసే జరిగింది. సామజవరగమన మూవీకి ప్రపంచవ్యాప్తంగా గా రూ. 3.20 కోట్ల బిజినెస్ అయింది.

ఏపీ, తెలంగాణలో: సామజవరగమన చిత్రానికి 15వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాలు కలిపి రూ. 21 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి. 14వ రోజున వచ్చినట్లుగానే 15వ రోజున రూ. 21 లక్షలు వచ్చాయి. కానీ, అంతకుముందు 13వ రోజున మాత్రం సామజవరగమన సినిమాకు రూ. 31 లక్షలు వసూళైంది.

15 రోజుల్లో: సామజవరగమన సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. ఇప్పటికీ 15 రోజుల్లో ఈ చిత్రానికి నైజాంలో రూ. 3.88 కోట్లు, సీడెడ్ లో రూ. 1.03 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.32 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 71 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 49 లక్షలు, గుంటూరులో రూ. 65 లక్షలు, కృష్ణాలో రూ. 68 లక్షలు, నెల్లూరులో రూ. 37 లక్షలు వసూలు అయింది.

ప్రపంచవ్యాప్తంగా: శ్రీ విష్ణు సామజవరగమన చిత్రానికి 15 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.13 కోట్ల షేర్, రూ. 17.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాలన్నీ కలిపి 15 రోజులకు రూ. 4.36 కోట్లు కలెక్ట్ అయింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా సామజవరగమనకు 15 రోజుల్లో రూ. 13.49 కోట్లు షేర్, రూ. 27.05 గ్రాస్ కలెక్ట్ అయింది.

లాభాలు ఎంతంటే?: శ్రీ విష్ణు లేటెస్ట్ సినిమా సామజవరగమనకు ప్రపంచవ్యాప్తంగా రూ. 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. దీంతో ఈ చిత్రానికి 15 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 13.49 కోట్లు వచ్చాయి. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసుకుని రూ. 9.99 కోట్ల లాభాలు అందుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 15 రోజుల్లో దాదాపు రూ. 15 కోట్ల లాభాలు అందుకుని సత్తా చాటింది.


Click it and Unblock the Notifications











