Samajavaragamana Collections: కొనసాగుతున్న శ్రీ విష్ణు కలెక్షన్ల మోత.. 19 రోజుల్లో ఆ లాభాలు ఏందయ్యా!
తెలుగులో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. చిన్న పాత్రలు పోషిస్తూ కథానాయకుడిగా తనను తాను ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఇటీవల పోలీస్ ఆఫీసర్ గా చేసిన అల్లూరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. ఆ ప్లాప్ నుంచి మంచి హిట్ కొట్టాలన్న ఆశయంతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అయినా సామజవరగమనతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా జోరుగా కలెక్షన్లు రాబడుతున్న నేపథ్యంలో సామజవరగమన 19 రోజుల వసూళ్లు చూద్దాం.
మలయాళ బ్యూటి: ద్రిష్టి, వివాహభోజనంబు వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన తాజా సినిమానే సామజవరగమన. ఇందులో శ్రీ విష్ణుకు జోడీగా మాలీవుడ్ క్యూట్ బ్యూటి రెబ్బ మౌనిక జాన్ హీరోయిన్ గా చేసింది. జూన్ 29న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ వీకే నరేష్, వెన్నెల కిశోర్ తదితరులు కామెడీతో అలరించారని రెస్పాన్స్ వస్తోంది.

ఎంత బిజినెస్ అంటే?: సామజవరగమన మూవీ టీజర్, ట్రైలర్ తో ఆది నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక రూ. 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమాకు మంచి బిజినెసే జరిగింది. సామజవరగమన మూవీకి వరల్డ్ వైడ్ గా రూ. 3.20 కోట్ల బిజినెస్ అయింది.
ఏపీ, తెలంగాణలో: సామజవరగమన సినిమాకు 19వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాలు కలిపి రూ. 21 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి. 18వ రోజున రూ. 36 లక్షలు, 17వ రోజున రూ. 20 లక్షలు వచ్చాయి. అంటే కాస్తా పెరుగుతూ, తగ్గుతూ వసూళ్లు నడుస్తున్నాయి.

19 రోజుల్లో:సామజవరగమన మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. ఇప్పటికీ 19 రోజుల్లో ఈ చిత్రానికి నైజాంలో రూ. 4.30 కోట్లు, సీడెడ్ లో రూ. 1.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.78 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 78 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 53 లక్షలు, గుంటూరులో రూ. 74 లక్షలు, కృష్ణాలో రూ. 76 లక్షలు, నెల్లూరులో రూ. 41 లక్షలు వసూలు అయింది.
ప్రపంచవ్యాప్తంగా: శ్రీ విష్ణు సామజవరగమన సినిమాకు 19 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.36 కోట్ల షేర్, రూ. 19.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాలన్నీ కలిపి 19 రోజులకు రూ. 4.64 కోట్లు కలెక్ట్ అయింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా సామజవరగమనకు 19 రోజుల్లో రూ. 15 కోట్లు షేర్, రూ. 30.45 గ్రాస్ కలెక్ట్ అయింది.

లాభాలు ఎంతంటే?:శ్రీ విష్ణు తాజా సినిమా సామజవరగమనకు ప్రపంచవ్యాప్తంగా రూ. 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. దీంతో ఈ చిత్రానికి 19 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 15 కోట్లు వచ్చాయి. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసుకుని రూ. 11.50 కోట్ల లాభాలు అందుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ హిట్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











