Samajavaragamana 2 Days Collections: తగ్గిన కలెక్షన్స్.. 2 రోజుల్లో అన్ని కోట్లు.. లాభం రావాలంటే?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు. మొదటి నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఎక్కువగా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ చిత్రాల్లో నటిస్తూ అలరించాడు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలీవరీతో అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా శ్రీ విష్ణు నటించిన చిత్రం సామజవరగమన. మంచి బజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. అలాగే కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సామజవరగమన మూవీ రెండు రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయనే లెక్కల్లోకి వెళితే..

తొలి కాంబినేషన్: ద్రిష్టి, వివాహ భోజనంబు వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన రామ్ అబ్బరాజు సామజవరగమన మూవీకి దర్శకత్వం వహించారు. శ్రీవిష్ణు-రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో తొలిసారిగా వచ్చిన ఈసినిమాలో మలయాళ క్యూట్ సుందరి రెబ్బ మోనిక జాన్ హీరోయిన్ గా చేసింది. ఇక గోపీ సుందర్ సంగీతం అందించారు. జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం.

Samajavaragamana 2 Days Collections

బిజినెస్ వివరాలు: సామజవరగమన చిత్రానికి మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. అందుకు కారణం సినిమాకు సంబంధించిన టీజరే. సామజరవగమన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్ కూడా పాజిటివిటీని మూటగట్టుకుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు బిజినెస్ పర్వాలేదనిపించుకుంది. సామజవరగమన మూవీకి వరల్డ్ వైడ్ గా రూ. 3.20 కోట్ల బిజినెస్ జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో: శ్రీ విష్ణు-రెబ్బ మోనిక జాన్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పర్వాలేదనిపిస్తోంది. తెలంగాణ, ఆంధ్రాలోని నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాలు కలుపుకుని రూ. 63 లక్షలు కలెక్ట్ అయ్యాయి. అంటే తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు కాస్తా తగ్గాయి.

Samajavaragamana 2 Days Collections

రెండు రోజుల్లో: రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన మూడో చిత్రం సామజవరగమనకు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో వసూళ్లు బాగానే ఉన్నాయి. ఈ చిత్రానికి 2 రోజులకు నైజాంలో రూ. 67 లక్షలు, సీడెడ్ లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 18 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలు కెలెక్ట్ అయింది.

వరల్డ్ వైడ్ గా: కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన శ్రీ విష్ణు సామజవరగమన మూవీకి రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.43 కోట్ల షేర్, రూ. 2.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాల్లో కలుపుకుని 2 రోజుల్లో రూ. 65 లక్షలు కలెక్ట్ అయ్యాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 2.08 కోట్లు షేర్, రూ. 3.85 గ్రాస్ కలెక్ట్ అయింది.

Samajavaragamana 2 Days Collections

బ్రేక్ ఈవెన్ కావాలంటే?: సామజవరగమన చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ. 3.20 కోట్ల బిజినెస్ జరగ్గా.. రూ. 3.50 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. అయితే సినిమాకు రెండు రోజుల్లో రోజు వరల్డ్ వైడ్ గా రూ. 2.08 కోట్లు రాగా.. ఇంకా రూ. 1.42 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి అవుతుంది. తర్వాత నుంచి వచ్చేవన్నీ లాభాలే. అయితే మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X