Samajavaragamana Collections: కలెక్షన్ల బీభత్సం.. మరో క్లబ్‌లో సామజవరగమన.. మైండ్ బ్లాక్ లాభాలు
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది యంగ్ హీరోలు తమ ప్రతిభ చాటుకుంటూ అభిమానులను సంపాదించుకుంటున్నారు. అలా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ తనదైన మార్క్ చూపించాడు. ఎక్కువగా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ చిత్రాలతో అలరిస్తూ ఉంటాడు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలీవరీతో అభిమానులను సంపాదించుకున్న శ్రీ విష్ణు తాజాగా నటించిన చిత్రం సామజవరగమన. ఈ చిత్రానికి కలెక్షన్స్ బాగుంటున్న నేపథ్యంలో 20 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..
అలాంటి రివ్యూలు:టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు, మలయాళ అందాల చిన్నది రెబ్బ మౌనిక జాన్ తొలిసారిగా జంటగా నటించిన మూవీ సామజరవరగమన. ద్రిష్టి, వివాహభోజనంబు వంటి సినిమాలను తెరకెకక్కించిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన సామజవరగమన సినిమాలో వీకే నరేష్, వెన్నెల కిశోర్ పండించిన హాస్యానికి తెలుగు ప్రేక్షకులు తెగ నవ్వుకున్నారని రివ్యూలు వచ్చాయి.

ఎంత బిజినెస్?:సామజవరగమన సినిమా టీజర్, ట్రైలర్ తో మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక రూ. 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా 500 థియేటర్లలో రిలీజ్ చేయగా ప్రస్తుతం వాటి సంఖ్య తగ్గింది. ఇక ఈ సినిమాకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సామజవరగమన మూవీకి ప్రపంచవ్యాప్తంగా గా రూ. 3.20 కోట్ల బిజినెస్ అయినట్లు సమాచారం.
20వ రోజున:సామజవరగమన చిత్రానికి బేబి సినిమా పోటీగా నిలిచిన నిలదొక్కుకుంటూ మంచి వసూళ్లే రాబడుతోంది. అయితే ఈ మధ్య మాత్రం కాస్త వసూళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. 20వ రోజున ఏపీ తెలంగాణలోని నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 16 లక్షల కలెక్షన్స్ వచ్చాయి.

20 రోజుల్లో:సామజవరగమన సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ కాస్తా తగ్గుముఖం పట్టాయి. దీంతో 20 రోజుల్లో ఈ సినిమాకు నైజాంలో రూ. 4.39 కోట్లు, సీడెడ్ లో రూ. 1.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.80 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 79 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 54 లక్షలు, గుంటూరులో రూ. 75 లక్షలు, కృష్ణాలో రూ. 77 లక్షలు, నెల్లూరులో రూ. 42 లక్షలు వసూలు అయింది.

ప్రపంచవ్యాప్తంగా:శ్రీ విష్ణు సామజవరగమనకు 20 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.52 కోట్ల షేర్, రూ. 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాలన్నీ కలిపి 20 రోజులకు రూ. 4.68 కోట్లు కలెక్ట్ అయింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా రూ. 15.20 కోట్లు షేర్, రూ. 30.90 గ్రాస్ కలెక్ట్ అయింది. అంటే 20 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్ల క్లబ్ లోకి, వరల్డ్ వైడ్ గా రూ. 30 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

ప్రాఫిట్ తెలుసా?శ్రీ విష్ణు లేటెస్ట్ సినిమా సామజవరగమనకు ప్రపంచవ్యాప్తంగా రూ. 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. దీంతో ఈ చిత్రానికి 20 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 15.20 కోట్లు వచ్చాయి. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు రూ. 11.70 కోట్ల లాభాలు సాధించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ హిట్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











