Samajavaragamana Collections: అమాంతం పెరిగిన కలెక్షన్స్.. శ్రీ విష్ణు కొత్త రికార్డ్.. లాభం ఎంతంటే?
టాలీవుడ్ ప్రామిసింగ్ హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు. మొదట్లో సినిమాల్లో ఫ్రెండ్స్, పెళ్లి కొడుకు, హీరో సిస్టర్ లవర్ వంటి చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. శ్రీ విష్ణు తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సామజవరగమన. ఎక్కువగా ఫ్యామిలీ, కామెడీ చిత్రాలతో ఆకట్టుకునే శ్రీ విష్ణు మరోసారి అలాంటి జోనర్ తో ఆడియెన్స్ ను మెప్పించాడు. ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సామజవరగమన చిత్రానికి మూడు రోజుల్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేద్దాం.
నటీనటులు
అలాంటి చిత్రాలు: టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా ప్రొడ్యూస్ చేసిన సామజవరగమన చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఆయన ఇదివరకు ద్రిష్టి, వివాహభోజనంబు వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఇక సామజవరగమన సినిమాలో శ్రీ విష్ణుకు జోడీగా మాలీవుడ్ ముద్దుగుమ్మ రెబ్బ మోనికా జాన్ హీరోయిన్ గా చేసింది.

ప్రీ రిలీజ్ బిజినెస్: ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సామజవరగమన. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే బిజినెస్ చేసుకుంది సామజవరగమన సినిమా. దీంతో ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా రూ. 3.20 కోట్ల మార్కెట్ అయింది.

తెలుగు రాష్ట్రాల్లో: తెలంగాణ, ఆంధ్రాలోని ఏరియాల్లో సామజవరగమన మంచి కలెక్షన్స్ రాబట్టింది. నైజాంలో రూ. 66 లక్షలు, సీడెడ్ రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 5 లక్షలు, గుంటూరు రూ. 7 లక్షలు, కృష్ణా రూ. 7 లక్షలు, నెల్లూరు రూ. 4 లక్షలు ఇలా అన్ని ఏరియాలు కలుపుకుని రూ. 1.17 కోట్లు కలెక్ట్ అయ్యాయి. అంటే రెండు రోజులతో పోలిస్తే మూడో రోజు అయిన శనివారం వసుళ్లూ ఒక్కసారిగా పెరిగాయి.

3 రోజుల్లో: రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన మూడో చిత్రం సామజవరగమనకు తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో వసూళ్లు బాగానే ఉన్నాయి. ఈ చిత్రానికి 3 రోజులకు నైజాంలో రూ. 1.36 కోట్లు, సీడెడ్ లో రూ. 24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 30 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 17 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలు కెలెక్ట్ అయింది.

ప్రపంచవ్యాప్తంగా: శ్రీ విష్ణు సామజవరగమన చిత్రానికి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.65 కోట్ల షేర్, రూ. 4.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాల్లో కలుపుకుని 3 రోజుల్లో రూ. 1.25 కోట్లు కలెక్ట్ అయ్యాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి మూడు రోజుల్లో రూ. 3.90 కోట్లు షేర్, రూ. 7.30 గ్రాస్ కలెక్ట్ అయింది. అంటే రూ. 10 కోట్ల క్లబ్ లోకి చేరేందుకు దగ్గరిలో ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది.

టార్గెట్ పూర్తి.. లాభాలు?: సామజవరగమన మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ. 3.20 కోట్ల బిజినెస్ జరగ్గా.. రూ. 3.50 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఇక, సినిమాకు 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 3.90 కోట్లు వచ్చాయి. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కావడమే కాకుండా రూ. 40 లక్షల లాభంతో హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో శ్రీ విష్ణుకి మంచి హిట్ పడటమే కాకుండా 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న హీరోగా రికార్డుకెక్కాడు.


Click it and Unblock the Notifications











